లేజర్లు లేకుండానే దృష్టిలోపాన్ని సరిచేసే కొత్త టెక్నిక్: EMRతో భవిష్యత్ విజన్ థెరపీ!

by Javid Pasha |

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇర్విన్ కు చెందినబ్రయన్ వాంగ్, ఆక్సిడెంటల్ కాలేజ్‌కు చెందిన మైకెల్ హిల్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు మరో కొత్త పద్ధతిని డెవలప్ చేశారు.

లేజర్లు లేకుండానే దృష్టిలోపాన్ని సరిచేసే కొత్త టెక్నిక్: EMRతో భవిష్యత్ విజన్ థెరపీ!
X

దిశ, ఫీచర్స్ : అధునాతన కంటి శస్త్ర చికిత్సల్లో భాగంగా లేజర్లను ఉపయోగిస్తారు. దీనివల్ల ట్రీట్మెంట్ సులభం అవుతుంది. అయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇర్విన్ కు చెందినబ్రయన్ వాంగ్, ఆక్సిడెంటల్ కాలేజ్‌కు చెందిన మైకెల్ హిల్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు మరో కొత్త పద్ధతిని డెవలప్ చేశారు. లేజర్లు లేకుండా కూడా దృష్టిని సరిచేయడానికి, కంటి చూపును మెరుగు పర్చడానికి ఎలక్ట్రో మెకానికల్ రీషేపింగ్ (EMR) అనే టెక్నిక్‌ను ప్రవేశపెట్టారు. అదేమిటి? ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పరిశోధకులు డెవలప్ చేసిన కొత్త మెథడ్‌లో కంటి మొదటి పొర అయిన కార్నియాను కట్ చేయకుండానే, సాఫ్ట్ విద్యుత్ ప్రవాహాల( gentle electric currents)తో దాని ఆకారాన్ని మారుస్తారు. అందుకోసం ప్లాటినమ్‌తో తయారు చేసిన ప్రత్యేక ‘కాంటాక్ట్ లెన్స్’ ఎలక్ట్రోడ్‌ను కార్నియా(Cornea) పై ఉంచి, సుమారు ఒక నిమిషం వ్యవధి గల తక్కువ స్థాయిలో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వాడుతారు. ఇది కార్నియాలోని కొల్లాజెన్ ఫైబర్ల(Collagen fibers) మధ్య ఆకర్షణలను బలహీనపరచడానికి టిష్యూ pHని తగ్గించి (Make acidic) సాఫ్ట్‌గా మారుస్తుంది. ఈ సమయంలో కార్నియా లెన్స్ ఆకారానికి అనుగుణంగా మారుతుంది. పవర్ ఔటేజ్ తర్వాత pH సాధారణ స్థితికి తిరిగి వచ్చి, కొత్త ఆకారాన్ని లాక్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ప్రభావవంతమైనదే కాకుండా, సురక్షితమైనదని కూడా పరిశోధకులు అంటున్నారు.

పరిశోధనలో భాగంగా కొత్త చికిత్స పద్ధతిని శాస్త్రవేత్తలు 12 కుందేళ్ల(Rabbits)పై పరీక్షించారు. వీటిలో 10 కుందేళ్లలోతక్కువ కంటి చూపు, దూర దృష్టి లోపం సమస్య అయిన మాయోపియా సృష్టించి చికిత్స చేశారు. అన్ని సందర్భాల్లోనూ కార్నియాను సరైన ఆకారంలోకి మార్చడం ద్వారా కంటి చూపును మెరుగు పర్చగలిగారు. పైగా ఏమాత్రం నష్టం లేకుండా కంటి భాగంలోని కణాలు జీవించి ఉన్నాయి. అంటే ఎటువంటి కటింగ్ లేదా లేజర్ కాంతి ప్రయోగం లేకుండానే ట్రీట్మెంట్ సక్సెస్ అయింది. ఇందుకు సంబంధించిన పద్ధతిని, ఫలితాలను శాస్త్రవేత్తలు అమెరికన్ కెమికల్ సొసైటీ ఫాల్ 2025 సమావేశాల్లోనూ ప్రస్తావించారు. ఈ చికిత్సా పద్ధతి మాయోపియా, హైపరోపియా (farsightedness), అస్టిగ్మటిజం(Astigmatism) వంటి దృష్టి సమస్యలకు భవిష్యత్ పరిష్కారంగా మారవచ్చునని నిపుణులు అంటున్నారు.

Next Story