ప్రోటీన్ నానోవైర్ మెమ్‌రిస్టర్.. మెదడుతో సంభాషించే కృత్రిమ న్యూరాన్!

by Javid Pasha |   (  Updated:2025-10-14 07:08:34  IST  )

మెదడు కణాలతో కమ్యూనికేట్ చేయగల సరికొత్త పరికరాన్ని సైతం యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ అమ్హెర్ట్స్(UMass Amherst)కు చెందిన పరిశోధకులు క్రియేట్ చేశారు.

ప్రోటీన్ నానోవైర్ మెమ్‌రిస్టర్.. మెదడుతో సంభాషించే కృత్రిమ న్యూరాన్!
X

దిశ, ఫీచర్స్ : మనిషి శరీరంలో నాడీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? న్యూరాన్ల ఎలక్ట్రిక్ బిహేవియర్ ఎలా ఉంటుంది? ఇలాంటి సందేహాలు నివృత్తి చేసుకునే క్రమంలో శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తుంటారు. అయితే తాజాగా ల్యాబ్ పరీక్షల్లో జీవంతో ఉన్న మెదడు కణాలతో కమ్యూనికేట్ చేయగల సరికొత్త పరికరాన్ని సైతం యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ అమ్హెర్ట్స్(UMass Amherst)కు చెందిన పరిశోధకులు క్రియేట్ చేశారు. దీనిని ‘protein nanowire-based memristor’ లేదా ‘bioelectronic neuron mimic’ అని పిలుస్తున్నారు. జీవసంబంధమైన న్యూరాన్ల ప్రవర్తనను అనుకరించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేయగల దీనిని ప్రోటీన్ నానోవైర్లను ఉపయోగించి సృష్టించారు. కాగా ఇది కేవలం 0.1 వోల్ట్‌ల వద్ద మాత్రమే పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు.

శాస్త్రవేత్తలు క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ న్యూరాన్ సహజమైన న్యూరల్ సిగ్నల్స్‌కు సరిపడే తక్కువస్థాయి శక్తి(Low power level) కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ఎలక్ట్రానిక్స్‌ను జీవశాస్త్రంతో ఇంటిగ్రేట్ చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగు అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇందులోని ప్రోటీన్ నానోవైర్లు బ్యాక్టీరియా నుండి తీసుకోబడ్డాయి. అంతేకాకుండా ఇవి సహజంగా ఉత్పత్తి అయ్యే పదార్థాలు కావడంతో ఈ టెక్నాలజీ బయోకంపాటిబుల్‌గా ఉంటుంది. పైగా పరికరం న్యూరాన్ల మధ్య సిగ్నల్ ట్రాన్స్‌మిషన్‌ను అనుకరిస్తూ, ఎక్సైటేటరీ, అలాగే ఇన్‌హిబిటరీ సిగ్నల్స్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇక దాని ఉపయోగాల విషయానికి వస్తే ఇది బ్రెయిన్ ఫంక్షన్‌ను మరింత డీప్‌గా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది ఎలక్ట్రానిక్స్, ప్రోస్థెటిక్స్, అలాగే బ్రెయిన్-మెషిన్ ఇంటర్‌ఫేస్‌లకు కొత్త మార్గాలు తెరుస్తుందని, భవిష్యత్తులో ఇలాంటి పరికరాలు న్యూరల్ డిసీజెస్ చికిత్సలో ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. Link

Next Story