- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Technology : స్పైడర్ రోబోలు వచ్చే్స్తున్నాయ్!
సాంకేతిక నిపుణులు అభివృద్ధి చేస్తున్న స్పైడర్ రోబోలు మానవులు చేయలేని అనేక పనులను చేయగలవు. నిర్మాణాల్లో కీ రోల్ పోషిస్తాయి.

దిశ, ఫీచర్స్ : రోబోటిక్ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే పలు రంగాల్లో హ్యూమనాయిడ్ రోబోలు, ఇండస్ట్రియల్ రోబోలు వర్క్ చేస్తున్నాయి. అయితే భవిష్యత్తులో మానవ శ్రమను తగ్గించి, మరింత సౌకర్యవంతమై సేవలు అందించగల రోబోల తయారీపై సాంకేతిక శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. అందులో భాగంగా ఆస్ట్రేలియాకు చెందిన నిపుణులు నిర్మాణ రంగంలో ఉపయోగించుకునేందుకు ‘Charlotte’ అనే స్పైడర్ లాంటి ఆరు కాళ్ల రోబోలను డెవలప్ చేస్తున్నారు. వీటిని ‘సెమీ అటానమస్ హెక్సాపాడ్ రోబోట్స్’ అని కూడా పిలుస్తున్నారు.
3D ప్రింటింగ్‌తో వర్క్..
సాంకేతిక నిపుణులు అభివృద్ధి చేస్తున్న స్పైడర్ రోబోలు నిర్మాణ రంగంలో మానవులు చేయలేని అనేక పనులను చేయగలవు. ముఖ్యంగా సైట్ మీద స్వేచ్ఛగా కదులుతూ లేయర్ బై లేయర్ 3D ప్రింటింగ్ (additive manufacturing) ద్వారా నిర్మాణాలు చేయడంలో కీ రోల్ పోషిస్తాయి. ట్రెడిషనల్ గాంట్రీ సిస్టమ్స్‌కు భిన్నంగా, ఇవి స్వయంగా స్థానం మార్చుకుని పని చేయగలవు. ఒక్క రోజులో సుమారు 200 చదరపు మీటర్ల (2150 sq ft) ఇంటి గోడలను పూర్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి.
సేఫ్టీని పెంచుతాయి
స్పైడర్ రోబోలు స్థానిక మట్టి, ఇసుక, వేస్ట్ మెటీరియల్స్ (Crushed brick, glass) వంటి సస్టైనబుల్ మెటీరియల్‌ను ఉపయోగించి వాటంతట అవే స్వయంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పైగా ఈ రోబోటిక్ సిస్టమ్ లేబర్ ఖర్చులను మెటీరియల్ వేస్ట్‌ను, నిర్మాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. కర్వ్స్ డిజైన్లు (Curved designs), కాంప్లెక్స్ డిజైన్లను సులభంగా అమలు చేస్తాయి. అంతేకాకుండా సైట్స్‌లో మానవుల ఎక్స్‌పోజర్ తగ్గించి సేఫ్టీని పెంచుతాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా హౌసింగ్ క్రైసిస్‌ను పరిష్కరించడానికి ఇలాంటి టెక్నాలజీపై శాస్త్రవేత్తలు దృష్టి కేంద్రీకరిస్తు్న్నారు. అయితే ఈ స్పైడర్ రోబోల తయారీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పూర్తి స్థాయి నిర్మాణ రంగాల్లో ఉపయోగించడానికి ప్రస్తుతం అందుబాటులో లేవు. భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.






