- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sapien Labs: హైదరాబాదీల మనస్సు బాలేదు..ప్రపంచ మానసిక ఆరోగ్య ర్యాంకింగ్‌లో భాగ్యనగరానికి షాక్..!
Sapien Labs: హైదరాబాద్ నగరానికి ఏమైంది. యువత ఆరోగ్యం ఎందుకు ఆందోళనకర స్థాయిలో ఉంది.

దిశ, వెబ్ డెస్క్: Sapien Labs: హైదరాబాద్ నగరానికి ఏమైంది. యువత ఆరోగ్యం ఎందుకు ఆందోళనకర స్థాయిలో ఉంది. ఇది మేము చెబుతున్న విషయాలు కాదు అంతర్జాతీయ సంస్థ సేపియన్ ల్యాబ్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయ్యింది. మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్టు..ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సూచీల్లో హైదరాబాద్ నగరం వెనబడినట్లు స్పష్టం చేసింది. ముఖ్యంగా యువత తీవ్రమైన మానసిక ఒత్తిడి, గందరగోళాన్ని ఎదుర్కుంటున్నట్లు ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.
సేపియన్ ల్యాబ్స్ ప్రపంచవ్యాప్తంగా 75 వేల మంది నుంచి వివరాలు సేకరించి మానసిక ఆరోగ్య సూచీ స్కేల్ ఆధారంగా ఈ రిపోర్టను రూపొందించింది. ఈ స్కేల్ ప్రకారం..ప్రపంచ సగటు స్కోర్ 63కాగా, హైదరాబాద్ నగరం కేవలం 58.3 స్కోర్ తో సరిపెట్టుకుంది. దేశంలోని మెట్రో నగరాల్లో పోల్చినా హైదరాబాద్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఢిల్లీ 54.4 స్కోర్ తో హైదరాబాద్ తర్వాత స్థానంలో నిలిచింది.
మానసిక ఆరోగ్యాన్ని తీవ్ర ఇబ్బందుల నుంచి వృద్ధి చెందడం వరకు పలు కేటగిరీలుగా ఎంహెచ్ క్యూ స్కేల్ విభజిస్తుంది. హైదరాబాద్ నగరం సగటున ఎండ్యూరింగ్, మేనేజింగ్ కేటగిరీల మధ్య ఉందని రిపోర్టు తెలిపింది. నగర జనాభాలో దాదాపు 31శాతం మంది బాధపడుతున్న లేదా కష్టపడుతున్న కేటగిరీలలో ఉన్నారు. ఇది వారిలో భావోద్వేగ నియంత్రణ లోపించడం సంబంధాలు బలహీనపడటం, మానసిక పనితీరు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నాయని సేపియన్ ల్యాబ్స్ డైరెక్టర్ శైలేంద్ర స్వామినాథ్ తెలిపారు.
ఈ నివేదికలో అత్యంత ఆందోళన కలిగించే అంశం యువత మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉండదని చెబుతున్నారు. 55ఏళ్లు పైబడినవారు అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి 102.4 స్కోర్ సాధించారు. 18 ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య వయస్సుకన్న యువత మాత్రం సగటున బేస్ లైన్ కంటే కేవలం 27 పాయింట్లు అధికంగా సాధించి ఎండ్యూరింగ్ కేటగిరీలో నిలిచారు. దాదాపు సగం మంది యువకులు ఏదొక రకమైన మానసిక బాధను, మనసును బలహీనపరిచే భావాలను అనుభవిస్తున్నారని డేటా స్పష్టం చేస్తున్నట్లు సేపియర్ ల్యాబ్స్ ప్రధాన శాస్త్రవేత్త తారా త్యాగరాజన్ తెలిపారు.






