- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : మొక్క ఆధారిత చూయింగ్ గమ్.. రోగకారక వైరస్‌లను చంపేస్తుంది!
పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మొక్కల ద్వారా సృష్టించిన ACE2 ప్రోటీన్‌ను ఉపయోగించి ఒక స్పెషల్ చూయింగ్ గమ్‌ను తయారు చేశారు.

దిశ, ఫీచర్స్ : మౌత్ ఫ్రెష్ కోసమో, టైమ్‌పాస్ కోసమో నమిలే చూయింగమ్ గురించి తెలిసిందే.. దీనివల్ల నోటికి కాస్త ఎక్సర్‌సైజ్ అవుతుందని, రక్త ప్రవాహం మెరుగుపడుతుందని కూడా చెప్తారు. అయితే తాజాగా పెన్సిల్వేనియా యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేసిన మొక్క ఆధారిత చూయింగ్ గమ్ మాత్రం అంతకు రెండింతల బెనిఫిట్స్ కలిగిస్తుంది. పైగా ఇది నోటిలో, శరీరంలో రోగకారక వైరస్‌లను చంపడంలో సహాయపడుతుందని కూడా అంటున్నారు. అదెలాగో తెలుసుకుందాం పదండి.
ఎలా పనిచేస్తుంది?
శాస్త్రవేత్తలు మొక్కల ద్వారా సృష్టించిన(Grown in plants) ACE2 ప్రోటీన్స్‌ను ఉపయోగించి ఒక స్పెషల్ చూయింగ్ గమ్‌ను డెవలప్ చేశారు. ఇందులో పోషకాలతోపాటు CTB-ACE2 (Cholera Toxin B fused with ACE2) ప్రోటీన్ మిళతమై ఉంటుంది కాబట్టి నోటిలో వేసుకొని చప్పరిస్తున్నప్పుడు అది లాలాజలంలోని వైరల్ పార్టికల్స్‌ను నిర్వీర్యం చేస్తుంది. దీంతో రోగకారక వైరస్‌లు, పార్టికల్స్ నోటి నుంచి మానవ కణాలకు అటాచ్ అవకుండా అడ్డుకుంటుంది.
వైరస్ లోడ్ తగ్గుతుంది!
ల్యాబ్ స్టడీస్‌లో లాలాజలం శాంపిల్స్‌ను పరిశీలించినప్పుడు కూడా ఈ చూయింగ్ గమ్ డెల్టా అండ్ ఒమిక్రాన్ వేరియంట్స్‌తో సహా.. SARS-CoV-2 వైరస్ లోడ్‌ను 95% కంటే ఎక్కువగా తగ్గించినట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా ఇది శ్వాస, మాట్లాడటం లేదా దగ్గటం ద్వారా వైరస్ ట్రాన్స్‌మిషన్‌ను సైతం తగ్గిస్తుంది. కాబట్టి ఇది వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుందని కూడా పరిశోధకులు అంటున్నారు. అయితే ఇది అందరూ వాడేందుకు ప్రస్తుతం అందుబాటులో లేదు. డోసెజ్ అండ్ రియల్ వరల్డ్ పెర్ఫార్మెన్స్‌ను వెరిఫై చేసేందుకు సేఫ్టీ టెస్టింగ్, క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఈ చూయింగ్ గమ్స్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.






