- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Traveling Benefits : ప్రయాణం.. యవ్వనాన్ని నిలబెట్టే ఆరోగ్య మార్గం..!
ప్రయాణంలో ఆరోగ్యకరమైన ఆహారాలు, ముఖ్యంగా స్థానిక పండ్లు, కూరగాయలు, సమతుల్య భోజనం వంటివి పరోక్షంగా వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి

దిశ, ఫీచర్స్ : కొంగొత్త ప్రాంతాలను సందర్శించడం, ప్రకృతి అందాలను ఆస్వాదించడమంటే కొందరికి మహా ఇష్టం. అందుకోసం తరచూ ఏదో ఒక టూరిస్టు ప్లేస్‌కో, దగ్గర్లోనే నచ్చిన కొత్త ప్రదేశానికో ట్రావెల్ చేస్తుంటారు. మరికొందరికైతే ఇదొక హాబీగానూ ఉంటుంది. అయితే దీనివల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటోంది ఆస్ట్రేలియాలోని ఎడిత్ కౌవన్ యూనివర్సిటీలో జరిగిన ఒక కొత్త అధ్యయనం. తరచుగా ప్రయాణం చేయడం వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేయవచ్చునని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇంతకీ ట్రావెలింగ్‌కి, వృద్ధాప్యం ఆలస్యం కావడానికి సంబంధం ఏమిటి? అలా ఎందుకు జరుగుతుంది?
పరిశోధకుల ప్రకారం.. ప్రయాణాల సమయంలో వ్యక్తులు అనుభవించే సానుకూల అనుభవాలు, సామాజిక పరస్పర చర్యలు(Social interactions) వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసి, ఎక్కువకాలం యవ్వనంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. ఎందుకంటే ట్రావెల్ చేయడం వల్ల ఎదుర్కొనే ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ వల్ల మానసిక ఉత్తేజం(mental stimulation) ఏర్పడుతుంది. దీంతోపాటు శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు సహజంగానే అలవడటంతోపాటు ఆటోమేటిగ్గా అనుసరిస్తుంటాం కూడా. ఇవి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడంలో కీ రోల్ పోషిస్తాయి. దీంతోపాటు కొత్త సంస్కృతులను అన్వేషించడం, విభిన్న వ్యక్తులతో సంభాషించడం, కొత్త వాతావరణంలో ఉండటం, కొత్త విషయాలను తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడం వంటి కారణాలవల్ల మెదడు చురుకుగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇవన్నీ ఒత్తిడిని తగ్గించి యవ్వనంగా ఉండటానికి సహాయపడతాయి.
అదనంగా.. ట్రావెల్ చేయడం ఫిజికల్ యాక్టివిటీని ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు, వాకింగ్, హైకింగ్ లేదా స్థానిక కార్యకలాపాలలో పాల్గొనడం వంటివి శరీర ఆరోగ్యాన్ని కాపాడతాయి. ప్రయాణంలో ఆరోగ్యకరమైన ఆహారాలు, ముఖ్యంగా స్థానిక పండ్లు, కూరగాయలు, సమతుల్య భోజనం, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఈ అంశాలన్నీ కలిసి వృద్ధాప్య సంకేతాలను తగ్గించి, జీవన శైలిని ఉత్తేజపరుస్తాయని అధ్యయనం సూచిస్తున్నది. మొత్తానికి ప్రయాణం కేవలం సరదాకో, విశ్రాంతికో మాత్రమే కాకుండా ఆరోగ్యానికి, వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయడానికి కూడా సహాయపడుతుందని పరిశోధకులు అంటున్నారు. Link






