- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Loneliness : ఎక్కువ సమయం ఒంటరిగా గడుపుతున్నారా..? ఈ సమస్యలు తప్పవు..!
నిజానికి డిప్రెషన్, పలు ఇతర మెంటల్ డిజార్డర్ల మాదిరిగా లోన్లీనెస్ తరచుగా గుర్తించబడదు. కానీ ఇది శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.

దిశ, ఫీచర్స్ : అప్పుడప్పుడూ ఒంటరి తనం కూడా కొంత మేలు చేస్తుంది. ఒత్తిడి, ఆందోళనల నుంచి బయటపడేందుకు సహాయపడుతుంది. అయితే తరచుగా అదే జరిగితే మాత్రం ప్రమాదమే అంటోంది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నిర్వహించిన ఒక అధ్యయనం. ఎక్కువ సమయం ఒంటరిగా గడపడం రోజువారీ పనులు చేయగల సామర్థ్యాన్ని తగ్గిస్తుందని పేరర్కొన్నది. ఇంకా ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అధ్యయనంలో భాగంగా లోన్లీనెస్ ఎటువంటి ప్రభావం చూపుతుందో పరిశీలించిన పరిశోధకులు 59% మంది ఒంటరిగా ఉండే వ్యక్తులు మెట్లు ఎక్కడం లేదా నడవడం వంటి సాధారణ పనులను చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా సామాజిక ఒంటరితనం, అలాగే లోన్లీనెస్ (Social isolation and loneliness) మెదడు ఆరోగ్యానికి హానికరమని కనుగొన్నారు. ముఖ్యంగా ఇవి వివిధ అంశాల్లో మానసిక సామర్థ్యం (Mental performance) తగ్గడానికి, డెమెన్షియా (50% high risk), అలాగే అల్జీమర్స్ వ్యాధి వంటి సమస్యలకు దారితీస్తాయని పరిశోధకులు అంటున్నారు.
నిజానికి డిప్రెషన్, పలు ఇతర మెంటల్ డిజార్డర్ల మాదిరిగా లోన్లీనెస్ తరచుగా గుర్తించబడదు. కానీ ఇది శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఈ ఒంటరితనం లోలోపలే భావోద్వేగ నొప్పి(Emotional pain)ని కలిగిస్తుంది. ఇది యువతకు జీవితంలో ఉత్సాహం తగ్గడానికి కారణమవుతుంది. ఇక దీర్ఘకాలిక ఒంటరి తనాని(Chronic loneliness)కి గురైన వారు ఇతరులపై అపనమ్మకం, భయం వంటి భావాలను అనుభవిసతారు. ఎమోషనల్ పెయిన్ అనేది శరీరంలో ఫిజికల్ పెయిన్‌తో సమానమైన ఒత్తిడి ప్రతిస్పందనలను యాక్టివేట్ చేస్తుంది.
అంతేకాకుండా లోన్లీనెస్ క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ పెరగడానికి, రోగనిరోధక శక్తి తగ్గడానికి దారితీస్తుంది. వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అలా జరగకూడదంటే.. దానిని ప్రారంభంలోనే గుర్తించి బయటపడాలంటున్నారు నిపుణులు, పరిశోధకులు. ముఖ్యంగా స్నేహితులతో కలిసి గడపడం, కుటుంబంతో టైమ్ స్పెండ్ చేయడం, ఇష్టమైన వ్యక్తితో మాట్లాడటం లేదా కమ్యూనిటీ యాక్టివిటీస్‌లో పాల్గొనడం వంటివి ఈ సమస్యను ఎదుర్కోవడానికి సహాయపడతాయి. లింక్
READ MORE ...
విపత్తులు, ఎమర్జెన్సీల్లో మానసిక ఆరోగ్యం
నిన్ను నువ్వు ప్రేమించుకో.. ఓటమి నుండి నేర్చుకో..! మహిళలకు బాలీవుడ్ నటి దీపికా పదుకొనె సూచనలివే..






