- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rekhachitram :యంగ్ మమ్ముట్టిని క్రియేట్ చేసిన ఏఐ.. నిజంగా మ్యాజిక్ చేసింది..
మాలీవుడ్ ఫిల్మ్ ‘‘రేఖాచిత్రం’’ బ్లాక్ బస్టర్ రన్ తర్వాత ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. రూ.9కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ఏకంగా రూ. 75కోట్లకు పైగా వసూల్ చేసి

దిశ, ఫీచర్స్ : మాలీవుడ్ ఫిల్మ్ ‘‘రేఖాచిత్రం’’ బ్లాక్ బస్టర్ రన్ తర్వాత ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. రూ.9కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ఏకంగా రూ. 75కోట్లకు పైగా వసూల్ చేసి వందలకోట్లు ఖర్చు పెట్టి ఫెయిల్ అయ్యే నిర్మాతలకు ఓ పాఠంగా మారింది. మాలీవుడ్ లెజెండరీ ఐకాన్ మమ్ముట్టి ‘‘కాదోడ్ కాదోరమ్’’ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ ఓ క్రైమ్ చుట్టూ తిరుగుతుంది. మమ్ముట్టి అన్నయ్య పక్కన హీరోయిన్‌గా నటించాలని ఎన్నో కళలతో వచ్చిన ఓ జూనియర్ ఆర్టిస్టు.. రేపు తన అభిమాన హీరో పక్కన డైలాగ్ చెప్తాననే ఆశతో పడుకుంటుంది. కానీ అదే రాత్రి కొందరి దుర్మార్గానికి బలవుతుంది. అసలు ఎవరు ఈ రేఖ? ఆమె కథేంటి? అనేది చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు భరతన్.
ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా చూశాక గుండె భారంతో మునిగిపోయినా.. మమ్ముట్టి అంత యంగ్‌గా ఎలా అయిపోయాడనే ఆలోచన రాక మానదు. అసలు ఆయనను ఈ మూవీలో నటించేందుకు ఎలా ఒప్పించారు? ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంటారు? బడ్జెట్ తొమ్మిది కోట్లు అన్నారు కదా ఆయన రెమ్యూనరేషన్ మాట ఎక్కడ వినిపించట్లేదేంటి? అనే సందేహాలు వస్తాయి. కానీ ఇక్కడే మూవీ టీమ్ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇక్కడ నిజమైన మమ్ముట్టిని కాకుండా ఏఐ క్రియేటెడ్ మమ్ముట్టిని వినియోగించింది. అవును టెక్నాలజీ సహాయంతో ఈ సూపర్ స్టార్ నిజంగానే ఈ సినిమాలో నటించాడనే అనుభూతిని కలిగించారు. ఈ అద్భుతమైన ప్రయోగంతో 1985లోని ‘‘కాదోడ్ కాదోరమ్’’ సెట్‌లో జరుగుతున్న సన్నివేశాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఇప్పటి యంగ్ హీరోయిన్ అనస్వరను అప్పటి యంగ్ హీరో మమ్ముట్టి ఏజ్‌ను మ్యాచ్ చేస్తూ మ్యాజిక్ క్రియేట్ చేశారు.
అయితే ఈ విషయాన్ని మూవీ థియేటర్‌లో ఉన్నప్పుడు సినిమా బృందం ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ప్రస్తుతం ‘‘రేఖాచిత్రం’’ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న సమయంలో ఈ సీక్రెట్ వెల్లడించింది. భారీ బడ్జెట్‌తో కూడిన చిత్రాలు కూడా నాసిరకం విజువల్ ఎఫెక్ట్స్‌తో ట్రోల్ చేయబడుతున్న సమయంలో ఈ చిత్ర బృందం ప్రశంసలు అందుకుంటుంది. మమ్ముట్టి యంగ్‌గా ఉన్నప్పటి వెర్షన్‌ను షూట్ చేసేందుకు నటుడు ట్వింకిల్ సూర్యను ఎంచుకున్నారు మేకర్స్. ఆయన మాలీవుడ్ ఐకాన్ మూమెంట్స్‌ను చక్కగా అనుకరించాడు. ఈ షూట్ తర్వాత ఆయన ముఖాన్ని డిజిటల్‌గా మమ్ముట్టి ఫేస్‌తో రీప్లేస్ చేసి.. ప్రేక్షకులకు సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ చేశారు. చిత్రీకరణ సమయంలో ట్వింకిల్ తన ముఖాన్ని రెండు వైపులా తిప్పవద్దని.. పెదాలను మూసి ఉంచాలని.. దంతాలు చూపకూదని సూచించారు. ఇక యంగ్ మమ్ముట్టి బాడీ సైజుకు తనను తాను మార్చుకోవాల్సి వచ్చిందని ట్వింకిల్ రీసెంట్ ఇంటర్వ్యూలో వివరించారు. కాగా మైండ్‌స్టెయిన్ స్టూడియోస్‌కు చెందిన ఆండ్రూ జాకబ్ డిక్రూజ్ ఏఐ డీఏజింగ్ ప్రాసెస్‌ను లీడ్ చేశారని తెలిపారు ట్వింకిల్.
READ MORE ...






