- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Health Tips: పండగ పూట మిగిలిన మటన్ కర్రీ వేడి చేసి తింటున్నారా? ఈ విషయం తెలుసుకోండి
Health Tips: చాలా మంది మిగిలిపోయిన ఆహారాన్ని వేడి చేసుకుని తింటుంటారు. ఇలా రెండోసారి ఉడికించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: Health Tips: సంక్రాంతి పండగ ముగిసింది. బంధువులు అంతా ఎవరి ఇళ్లకు వారు పయనమవుతున్నారు. అయితే సంక్రాంతి పండగకు పిండి వంటలతోపాటు మాంసాహారం కూడా ఎక్కువగా వండుతుంటారు. పండగ రోజు తినగా ఎంతో కొంత మర్నాడుకు మిగిలిపోతుంది. చలికాలం కావడంతో ఉదయానికి కూర చల్లగా మారుతుంది. దీంతో భోజనం చేసే సమయానికి మళ్లీ వేడి చేసుకుని తింటుంటారు. ఇలా చాలా మంది ఇళ్లలో జరుగుతూనే ఉంటుంది. అయితే ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని వేడి చేయడం వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మటన్ కర్రీ వండేటప్పుడు అనేక రకాల కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయట. ఎందుకంటే మాంసంలో ఎన్నో రకాల పదార్థాలు వేస్తుంటారు. అవన్నీ కూడా ఒక్కోరసాయనిక చర్య జరుపుతుంటాయి. ఇవన్నీ కూడా మాంసం రుచి, రంగును మార్చేస్తాయి. అలా వండిన మాంసాన్ని తెల్లవారు మళ్లీ వేడి చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా రెండోసారి వేడిచేస్తే కెమికల్ రియాక్షన్స్ మరింత తీవ్రమై కొన్ని హానికరమైన పదార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ వల్ల తీవ్రమైన అనారోగ్యం, ఆసుపత్రిలో చేరడం వరకు వస్తుంది. అందుకే ఒకసారి వండిన మాంసాన్ని రెండుసార్లు వేడి చేయకూడదు. మాంసం వండిన తర్వాత వెంటనే రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి. మటన్ వండేటప్పుడే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పచ్చిమాంసాన్ని ఎక్కువసేపు బయట ఉంచకూడదు. అలా ఉంచితే బ్యాక్టీరియా త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. ఫ్రిజ్ లో పెట్టినా బయటకు తీసిన వెంటనే దానిని వండాలి.






