పడుకున్న వాళ్ళ నోటి నుంచి లాలజలం కారుతుందా...అయితే ఇవి తెలుసుకోండి!

by velandi.Saikiran |

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. అలాంటిది ఆరోగ్యం పట్ల మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత కాలంలో... జంక్

పడుకున్న వాళ్ళ నోటి నుంచి లాలజలం కారుతుందా...అయితే ఇవి తెలుసుకోండి!
X

దిశ, వెబ్ డెస్క్: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. అలాంటిది ఆరోగ్యం పట్ల మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత కాలంలో... జంక్ ఫుడ్ ఎక్కువ కావడం వల్ల జనాలు... అనారోగ్యం పాలవుతున్నారు. అందుకే ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త ఉంటే.... అంత మంచిది. అయితే కొంతమంది నిద్ర పోతున్న సమయంలో నోటి నుంచి లాలాజలం కారుతుంది. అలా కారడం వల్ల అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

నాడీ సంబంధిత సమస్యలు ఉన్న వారి శరీరం కండరాలను నియంత్రణించలేకపోతుందని అంటున్నారు. ఆ కారణంగానే నిద్రపోతున్నప్పుడు కొంత మంది నోటి నుంచి లాలాజలం కారుతుందని చెబుతున్నారు. గొంతు అలాగే సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో కూడా లాలాజలం కారే సమస్య ఉంటుందని కూడా చెబుతున్నారు. అలర్జీలు కూడా నోటి నుంచి లాలాజలం కారడానికి ఒక ముఖ్య కారణమని కూడా పేర్కొంటున్నారు వైద్యులు.

అంతే కాదు ఎసిడిటీ ( SDT) సమస్య ఉన్నవారు కూడా... ఎక్కువగా లాలాజలం కారే సమస్యను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. తీవ్రమైన నిద్ర సంబంధిత వ్యాధులు ఉన్నవారి నోటి నుంచి కూడా లాలాజలం వస్తుందట. అయితే ఇలాంటివారు... సరైన సమయంలో నిద్ర లేవడం... ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. మాంసాహారాలు తక్కువ చేయాలని కూడా సూచనలు చేస్తున్నారు వైద్యులు. పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఖచ్చితంగా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు.

Next Story