రియల్ లైఫ్ కుంభకర్ణుడు.. ఏడాదిలో 300రోజులు నిద్రే...

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-14 08:22:10  IST  )

రామాయణంలో కుంభకర్ణుడు గురించి తెలుసు కదా. నిద్రకు మారుపేరుగా పరిగణించబడుతాడు. అయితే రియల్ లైఫ్‌లోనూ ఓ కుంభకర్ణుడుగా పిలవబడుతున్నాడు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి. నాగౌర్ జిల్లా భద్వా గ్రామవాసి అయిన పుర్ఖారామ్ ఏడాదిలో 300రోజులు

రియల్ లైఫ్ కుంభకర్ణుడు.. ఏడాదిలో 300రోజులు నిద్రే...
X

దిశ, వెబ్ డెస్క్ : రామాయణంలో కుంభకర్ణుడు గురించి తెలుసు కదా. నిద్రకు మారుపేరుగా పరిగణించబడుతాడు. అయితే రియల్ లైఫ్‌లోనూ ఓ కుంభకర్ణుడుగా పిలవబడుతున్నాడు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి. నాగౌర్ జిల్లా భద్వా గ్రామవాసి అయిన పుర్ఖారామ్ ఏడాదిలో 300రోజులు నిద్రలోనే ఉంటాడు. 42ఏళ్ల వ్యక్తి అయిన పుర్ఖారామ్‌కు ఈ పరిస్థితి 23ఏళ్ల క్రితం నుంచే ఏర్పడింది. యాక్సిస్ హైపర్‌సోమ్నియా అనే స్లీప్ డిజార్డర్ ఇందుకు కారణం కాగా బ్రెయిన్‌లోని TNF-alpha ప్రోటీన్‌ లోపం వల్ల కలుగుతుంది. ఒక్కసారి నిద్రపోతే దాదాపు 25రోజులు అలాగే పడుకుంటాడు. ఆయన ఆహారం, స్నానం వంటి విషయాల గురించి భార్య, తల్లి జాగ్రత్తలు తీసుకుంటారు.

మొత్తానికి నెలలో కేవలం నాలుగు నుంచి ఐదురోజులు మాత్రమే మెళకువతో ఉండే పుర్ఖారామ్.. పనిలో ఉన్నా, తింటున్న సమయంలో కూడా హఠాత్తుగా నిద్రలోకి వెళ్లిపోతాడు. పడుకోని సమయంలో తలనొప్పి, అలసటతో బాధపడుతుంటాడు. మెడిసిన్ వినియోగంతో కూడా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ నాడీ సంబంధిత రుగ్మతకు పూర్తి ఉపశమనం ఉండకపోవచ్చని అంటున్నారు విశ్లేషకులు.

Also Read..

తీవ్రంగా వేధిస్తోన్న ‘ఒత్తిడి’.. ఎదుర్కొనేదెలా!?

Next Story