- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కూల్ బాత్రూంలో రేవ్ పార్టీ.. స్నాప్ చాట్‌లో ప్లానింగ్ చేసి మరీ...
కొందరికి పుట్టుకతోనే మ్యూజిక్‌పై ఇంట్రెస్ట్ ఉంటుంది. మాంచెస్టర్‌లోని ఉర్మ్‌స్టన్‌కు చెందిన పండేళ్ల కేల్ బెల్ ఈ కేటగిరీకి చెందిన వాడే. కాగా సెయింట్ ఆంటోనీస్ కాథలిక్

దిశ, ఫీచర్స్ : కొందరికి పుట్టుకతోనే మ్యూజిక్‌పై ఇంట్రెస్ట్ ఉంటుంది. మాంచెస్టర్‌లోని ఉర్మ్‌స్టన్‌కు చెందిన పండేళ్ల కేల్ బెల్ ఈ కేటగిరీకి చెందిన వాడే. కాగా సెయింట్ ఆంటోనీస్ కాథలిక్ కాలేజీలో చదువుతున్న ఈ బాలుడు.. లంచ్ బ్రేక్‌లో స్కూల్ బాత్రూమ్‌లో రేవ్ పార్టీ నిర్వహించి వైరల్ అయ్యాడు. స్నాప్ చాట్‌లో రేవ్ ప్లాన్ చేసిన కేల్... ఎనిమిదో తరగతి అబ్బాయిలందరినీ ఆహ్వానించాడు. క్యాడ్‌బరీ ట్విర్ల్ చాక్లెట్స్, లూకోజెడ్ ఎనర్జీ డ్రింక్స్ ఫ్రీగా అందించాడు. డీజే డెక్స్, స్పీకర్లు, డిస్కో లైట్లు అన్నీ తీసుకొచ్చి బాత్రూమ్‌లోనే పూర్తిగా సెట్ చేశాడు.
కాగా లంచ్ బ్రేక్ సమయంలో జరిగిన ఈ రేవ్ సుమారు 30 నిమిషాల పాటు కొనసాగింది. బాత్రూం 8వ తరగతి అబ్బాయిలతో నిండిపోయి.. సంగీతం, లైట్లు, స్నాక్స్‌తో పార్టీ ఉత్సాహంగా సాగింది. అయితే శబ్దం, గందరగోళం గురించి తెలిసిన ఉపాధ్యాయులు జోక్యం చేసుకుని పార్టీని ఆపేశారు. కేల్ డీజే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కానీ కేల్ తల్లి లూయిస్ బెల్ మాత్రం తనకు సపోర్ట్ ఇచ్చింది. చిన్న వయసు నుంచే అతనికి సంగీతం పట్ల మక్కువ ఉందని.. స్వయంగా డీజే నేర్చుకుని, తన డబ్బుతో సామగ్రిని కొనుగోలు చేశాడని... ఒక్క మాటలో చెప్పాలంటే అతను సంగీతంతో జీవిస్తాడని చెప్పింది. తన సహవిద్యార్థులకు కొంత సరదా అందించాలనే ఉద్దేశంతో ఈ రేవ్‌ను నిర్వహించాడని వివరించింది. ఈ సంఘటన 2020 డిసెంబర్‌లో యూకేలో కోవిడ్-19 ఆంక్షల మధ్య జరగ్గా.. సామాజిక కార్యకలాపాల కోసం ఆసక్తిగా ఉన్న విద్యార్థులను ఈ ఈవెంట్ మరింత అట్రాక్ట్ చేసింది. కాగా బీబీసీ వంటి మీడియా సంస్థలు అతన్ని జీనియస్‌గా వర్ణించాయి. రేల్ కల్చర్ హీరోగా ప్రశంసించాయి.






