Viral Video: చాహల్‌ను హత్తుకున్న ప్రీతి.. ఫొటో వైరల్‌.. నువ్వు తోపురా మావా!

by Vennela |
Viral Video: చాహల్‌ను హత్తుకున్న ప్రీతి.. ఫొటో వైరల్‌.. నువ్వు తోపురా మావా!
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: KKR పై పంజాబ్ చారిత్రాత్మక విజయంపై ప్రీతి జింటా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చాహల్ బౌలింగ్ (4/28) మ్యాచ్‌ను మలుపు తిప్పింది. దీంతో KKR 95 పరుగులకే ఆలౌట్ అయింది. పంజాబ్ విజయం తర్వాత, ప్రీతి స్టాండ్స్‌లో చప్పట్లు సందడి చేశారు. తరువాత మైదానంలోకి వెళ్లి చాహల్‌ను కౌగిలించుకుంది. ఈ భావోద్వేగ క్షణం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ మ్యాచ్ లో చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టి కోల్ కతా పరాజయానికి కారణమయ్యాడు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన కోల్ కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే అలౌట్ అయ్యింది.

ఈ మ్యాచ్ కు ముందు వరకు రెండు వికెట్లు మాత్రమే తీసిన చాహల్..కోల్ కతాతో మ్యాచులో 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. ఒకానొక సమయంలో 9 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసి విజయం దిశగా దూసుకెళ్తున్నట్లు కనిపించింది కోల్ కతా. కానీ 15.1 ఓవర్లలో 95 పరుగులకే అలౌట్ అయ్యింది.

పంజాబ్ కు అనూహ్యంగా అందించిన విజయంతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రీతి జింటా సంతోషాన్ని ఆపుకోలేకపోయింది. చాహల్ ను ఎత్తుకుని తన సంతోషాన్ని పంచుకుంది. చాహల్ తో కాసేపు ముచ్చట పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Next Story