- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొక్కలు కూడా మాట్లాడుతాయని తెలుసా..? ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే..
మొక్కలు ఒత్తిడిలో ఉన్నప్పుడు అల్ట్రాసోనిక్ శబ్దాలను రిలీజ్ చేస్తాయని, ఈ శబ్దాలను కీటకాలు వినగలవని ఒక పరిశోధనలో తేలింది.

దిశ, ఫీచర్స్ : మనుషులు మాట్లాడుకుంటారు. జంతువులు కూడా వివిధ శబ్దాల ద్వారా వాటి భాషలో అవి మాట్లాకుంటాయి. అయితే మొక్కలు కూడా మాట్లాడుతాయని మీకు తెలుసా?.. కాకపోతే వీటి మాటలు మనకు వినబడవు. కానీ కీటకాలు మాత్రం వినగలుగుతాయి. మొక్కలు మాట్లాడుకోవడమంటే, ఇక్కడ మనలాగా స్పష్టంగా పదాలను ఉపయోగించడం కాదు. అవి ఒక రకమైన శబ్దాలను విడుదల చేస్తాయని తెల్ అవీన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.
ప్రకృతిలో ప్రతీ జీవి ఏదో ఒక కమ్యూనికేషన్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. మొక్కలు కూడా అంతే.. అవి ప్రమాదకరమైన సందర్భాలను గ్రహించినప్పుడు ఒక విధమైన శబ్దాలను విడుదల చేస్తాయి. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు అల్ట్రాసోనిక్ శబ్దాలను రిలీజ్ చేస్తాయని, ఈ శబ్దాలను కీటకాలు వినగలవని పరిశోధనలో తేలింది. ఉదాహరణకు టొమాటో మొక్కలకు సరిపడా నీరు అందకపోతే అవి ఎండిపోయే దశకు చేరుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు అవి ఒత్తిడికి లోనవుతాయి. ఏదో ప్రమాదం జరుగుతుందని గ్రహిస్తాయి. సరిగ్గా ఈ సందర్భంలో అవి మాట్లాడటం మొదలు పెడతాయి. అంటే తమను తాము సంరక్షించుకోవడానికి కావిటేషన్ (కాండంలో గాలి బుడగలు పగిలినప్పుడు) వల్ల అధిక-తరంగ శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి.
టొమాటో మొక్కలు మాత్రమే కాదు, వివిధ అన్ని రకాల మొక్కలు కూడా ఆయా సందర్భాల్లో ముఖ్యంగా గాలి, నీరు, ఆహారం(కిరణ జన్య సంకయోగక్రియ) అందనప్పుడు ఈ శబ్దాలను విడుదల చేస్తాయి. అయితే ఇవి మానవులకు వినిపించవు. కానీ వివిధ కీటకాల(insects)కు వినిపిస్తాయని, మొక్కల మాటలను అవి అర్థం చేసుకుంటాయని పరిశోధకులు అంటున్నారు. తమ పరిశోధన మొక్కలు, కీటకాల మధ్య ఒక రహస్య కమ్యూనికేషన్ ఉందని గుర్తించినట్లు తెల్ అవీన్ యూనివర్సిటీ(Tel Aviv University)కి చెందిన పరిశోధకులు అంటున్నారు. ఇది ఇప్పటి వరకు తెలియని ఒక పర్యావరణ అద్భుతంగా పేర్కొంటున్నారు. Link






