కొందరు చిన్న విషయానికే ఫీల్ అవుతారు.. కానీ మంచోళ్లు..!!

by Javid Pasha |

సంబంధాలలో చిన్న చిన్న విషయాలకే ఫీలయ్యే వ్యక్తులు, త్వరగా కోపం తెచ్చుకునేవారు మంచి మనస్తత్వం కలిగి ఉంటారని ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీ‌లో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొన్నది.

కొందరు చిన్న విషయానికే ఫీల్ అవుతారు.. కానీ మంచోళ్లు..!!
X

దిశ, ఫీచర్స్ : ఇది తెలుసా? సంబంధాలలో చిన్న చిన్న విషయాలకే ఫీలయ్యే వ్యక్తులు, త్వరగా కోపం తెచ్చుకునేవారు వాస్తవానికి మంచి మనస్తత్వం కలిగి ఉంటారని ఫ్రంటియర్స్ ఇన్ సైకాలజీ (Frontiers in Psychology)లో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొన్నది. ముఖ్యంగా వీరు తమ భాగస్వామిపట్ల ఎక్కువ ప్రేమ, శ్రద్ధ కలిగి ఉంటారని, అది లోతైన భావనకు దారితీస్తుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు వెల్లడించింది. ఇక్కడ సంబంధంలో ఎమోషనల్ సెన్సిటివిటీ అనేది బలమైన అనుబంధానికి దారితీస్తుందని, ఇది సంబంధాన్ని కోల్పోతామనే భయం నుంచి కూడా ఉద్భవిస్తుందని అధ్యయనం తెలిపింది.

పరిశోధకులు గుర్తించిన విషయం ఏమిటంటే.. చిన్న చిన్న పొరపాట్లు, తప్పుడు అవగాహనలు, సమస్యలపై నిరాశ లేదా కోపం వ్యక్తం చేసే భాగస్వాములు, ఉదాసీనంగా(indifferent) ఉండే వారి కంటే, ఎక్కువగా ఎమోషనల్ టచ్ కలిగి ఉంటారు. పైగా ఈ వ్యక్తులు సాధారణంగా రిలేషన్‌షిప్‌లో సాన్నిహిత్యాన్ని, భాగస్వామి నుంచి భరోసాను (Reassurance) ఎక్కువ విలువైనదిగా భావిస్తారు. ఈ కారణంగానే సంబంధంలో సమస్యలు లేదా విభేదాలు తలెత్తినప్పుడు త్వరగా కోపం, అసహనానికి గురికావడం, అతి స్పదించడం (Overreact) వంటి బిహేవియర్‌ను ప్రదర్శించే అవకాశం ఉంటుంది.

అయితే తరచుగా శ్రద్ధ, త్వరగా కోపం తెచ్చుకోవడం అనే ప్రవర్తన సంబంధంలో బ్యాలెన్స్‌డ్‌(balanced)గా ఉండాలని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు ఎమోషనల్ అవేర్‌నెస్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ద్వారా భద్రత, అవగాహనతో ఉన్నట్లు భావించేలా చూసుకోవాలి. ఒకరి ఎమోషనల్ సెన్సిటివిటీ సంబంధాన్ని బలోపేతం చేయగలదు. కానీ అది అనియంత్రితం(Uncontrollably)గా ఉంటేనో లేదా సరైన కన్వర్జేషన్ లేకుంటేనో ఒత్తిడికి, తప్పుడు అవగాహనలకు దారితీయవచ్చు. కాబట్టి సంబంధంలో ఆరోగ్యకరమైన సమతుల్యతను నిర్వహించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. Link

Next Story