- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పహల్గాంలో కొంచెం గడబిడ జరిగిందంతే.. లైట్ తీసుకోండి.. అంటూ కిట్టీపార్టీ చేసుకున్న ఆంటీలు.. వీడియో వైరల్
పహల్గాం ఎటాక్‌తో దేశం అంతా విషాద ఛాయలతో మునిగిపోతే.. ఈ ఆంటీలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. పైగా ఈ ఉగ్రదాడి కొంచెం గడ బిడ లాంటిదని లైట్ తీసుకుంటూ కామెంట్

దిశ, ఫీచర్స్ : పహల్గాం ఎటాక్‌తో దేశం అంతా విషాద ఛాయలతో మునిగిపోతే.. ఈ ఆంటీలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. పైగా ఈ ఉగ్రదాడి కొంచెం గడ బిడ లాంటిదని లైట్ తీసుకుంటూ కామెంట్ చేయడం నెటిజన్లకు పిచ్చి కోపం తెప్పిస్తుంది. కశ్మీర్‌లో కిట్టీపార్టీ చేసుకుంటున్న ఈ ఆంటీలు కనీసం జాలి, దయ లేకుండా.. కామన్‌సెన్స్ లేని బిహేవియర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ దిక్కు దేశం యుద్ధం ప్రకటించేందుకు సిద్ధంగా ఉంటే వీరు ఇంత చిల్ అవుతున్నారని మండిపడుతున్నారు.
పహల్గాం టెర్రర్ ఎటాక్‌లో మన వాళ్లు చిందించిన రక్తాన్ని చోటీ మోటీ గడ్ బడ్ అని కొట్టిపారేస్తూ.. కిట్టి పార్టీలలో చాయ్ తాగే ఈ ఆంటీలు సిగ్గుపడాలి. మీ ధర్మం, మానవత్వం ఎక్కడ? మన పూర్వీకులు ఈ భూమి కోసం పోరాడారు.. మీ చిల్లర బిహేవియర్‌తో వారి త్యాగాన్ని అపహాస్యం చేస్తున్నారు? ఉగ్రవాదానికి 26 మంది ప్రాణాలు కోల్పోవడం మీకు అర్థం కాకపోగా.. గడ్ బడ్ లాగా ఉందా? నిజమైన హిందువులు న్యాయం, గౌరవం కోసం నిలబడినప్పుడు.. జ్ఞానం లేకుండా చిందులేస్తున్నారా? మన విలువలకు ఈ ద్రోహులను దూరంగా ఉంచండి? అని తిట్టిపోస్తున్నారు. చెంప మీద రెండిచ్చేవాళ్లు లేక ఇలా చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.
Look at these aunties, dismissing #PahalgamTerrorAttack as ‘choti moti gadbad’! Typical kitty party crowd! No brains, no compassion, no patriotism, no ideology, no empathy! Unfortunately, I bet, all of them would be Hindu! pic.twitter.com/BWudkSZhvn
— Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) April 25, 2025






