- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే ఇండస్ట్రీ వద్దు.. అన్ని భాషల హీరోలే ముద్దు అంటున్న ప్రభాస్ బ్యూటీ
మాళవిక మోహనన్(Malavika Mohanan) ‘తంగలాన్’తో కోలీవుడ్‌లో హిట్ అందుకుని తన ఇమేజ్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

దిశ, సినిమా: మాళవిక మోహనన్(Malavika Mohanan) ‘తంగలాన్’తో కోలీవుడ్‌లో హిట్ అందుకుని తన ఇమేజ్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఆ తర్వాత మోహన్‌లాల్ సరసన నటించిన ‘హృదయ పూర్వం’తో బ్లాక్‌బస్టర్ అందుకుంది. తనకంటే వయసులో ఎంతో పెద్ద స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసినా, నటనతో అందరి దృష్టిని ఆకర్షించడంలో మాళవిక సక్సెస్ అయ్యింది. అదే జోష్‌తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మాళవిక ‘ది రాజాసాబ్’(The Rajasab)తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. జనవరి 9న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినా, మాళవిక పర్ఫార్మెన్స్‌కి మాత్రం మంచి మార్కులే పడుతున్నాయి. దీంతో తెలుగులోనూ స్టార్ హీరోల సరసన అవకాశాలు త్వరలోనే దక్కుతాయనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక ఆసక్తికర విషయాలు పంచుకుంది.
తాను కేవలం ఒకే సినిమా పరిశ్రమకే పరిమితం కావాలనుకోవడం లేదని స్పష్టం చేసింది. బహుళ భాషలు మాట్లాడగలగడం వల్ల వేర్వేరు ఇండస్ట్రీల్లో పని చేసే అవకాశాలు వస్తున్నాయని, ఇది తన కెరీర్‌కు పెద్ద ప్లస్‌గా మారిందని చెప్పింది. అంతేకాదు.. అన్ని భాషల స్టార్ హీరోలతో నటించాలనే కోరిక తనలో ఉందని కూడా వెల్లడించింది. ప్రస్తుత కాలం నటులకు నిజంగా గోల్డెన్ పీరియడ్ అని మాళవిక అభిప్రాయపడింది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా కారణంగా ఇండస్ట్రీల మధ్య ఉన్న సరిహద్దులు దాదాపుగా చెరిగిపోయాయని పేర్కొంది. “ఇప్పుడు ఒక సినిమా ఎక్కడ తీసినా, ఏ భాషలో చేసినా… అది మంచి సినిమా అయితే తప్పకుండా తన ప్రేక్షకులను చేరుకుంటుంది” అంటూ కంటెంట్ పవర్‌పై తన నమ్మకాన్ని వెల్లడించింది. అలాగే ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించింది.
ఆయనకు తెరపై ఉన్న మనోహరమైన ప్రెజెన్స్, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమని, అతనికి ఉన్న స్టార్‌డమ్‌ను దగ్గరగా చూసి ప్రత్యక్షంగా అనుభవించడం నిజంగా అద్భుతంగా అనిపించిందని తన అనుభవాన్ని పంచుకుంది. తన పాత్రల ఎంపికపై కూడా క్లారిటీ ఇచ్చింది. “నాలో ఒక భాగం భారీ బడ్జెట్‌తో రూపొందే విభిన్నమైన కమర్షియల్ సినిమాలు చేయాలని కోరుకుంటుంది. అదే సమయంలో అందంగా రాసిన మలయాళ సినిమాల్లో నటించడం కూడా నాకు చాలా ఇష్టం. ఈ రెండింటినీ ప్రయోగాత్మక కథలతో సమతుల్యం చేస్తూ ముందుకు వెళ్లాలనుకుంటున్నా” అని చెప్పుకొచ్చింది.






