గాజు కిటికీల రైలు ప్రయాణం.. విండోసీటు కాదు.. ఆకాశమంతా మీదే..!

by Javid Pasha |   (  Updated:2026-02-06 11:55:01  IST  )

పానరమిక్ నైట్ ట్రైన్‌‌లోని క్యారేజీలు పూర్తిగా గాజు గోడలతో రూపొందించబడి ఉంటాయి. ప్రయాణికులు లోపల ఉంటూనే బయటి పరిసరాలన్నీ చూడొచ్చు.

గాజు కిటికీల రైలు ప్రయాణం.. విండోసీటు కాదు.. ఆకాశమంతా మీదే..!
X

దిశ, ఫీచర్స్ : బస్సులోనో, ట్రైన్‌లోనో వెళ్తున్నప్పుడు కిటికీ వద్దే కూర్చుంటామని మారాం చేసిన బాల్య సృృతులు మీకు గుర్తున్నాయా? చిన్నతనంలోనే కాదు.. ఏ వయసులోనైనా జర్నీలో చాలా మంది విండోసీట్ పక్కన కూర్చోవడానికే ఎక్కువ ఇష్టడుతుంటారు. ఎందుకంటే.. అలా లాలా వాహనం కదులుతూ ఉంటే.. కిటికీలోంచి బయబటి పరిసరాలను చూడొచ్చు. ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఇలాంటప్పుడే ఆ చాన్స్ దక్కని వారికి.. కిటికీ దగ్గరి సీటులో కూర్చున్న వారికే కాకుండా.. ట్రైన్‌లో కూర్చున్న వారందరికీ బయటి పరిసరాలు కనిపించే ఏర్పాట్లు ట్రైన్‌లో ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ కలను నిజం చేసింది నార్వే ప్రభుత్వం.

అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ..

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గాజు కిటికీలతో కూడిన పానరమిక్ నైట్ ట్రైన్‌ను ప్రారంభించింది నార్వే దేశం. మిడ్‌నైట్ అరోరా రూట్ (Midnight Aurora Route) అని దీనికి పేరు పెట్టారు. ఇది ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఉత్తర దీపాలు (Northern Lights / Aurora Borealis) చూడటానికి రూపొందించబడింది. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఈ రూట్ చూడ్డానికి చాలా అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా నార్వేలోని ఆర్కిటిక్ ప్రాంతంలో Ofoten Line మీదుగా కూడా ఈ పానరమిక్ నైట్ ట్రైన్ నడుస్తుంది. ఇది నార్విక్ (Narvik) నుంచి ప్రారంభం అవుతుంది.

మెరిసే నక్షత్రాలు.. కదులుతున్న మేఘాలు..

పానరమిక్ నైట్ ట్రైన్‌‌లోని క్యారేజీలు పూర్తిగా గాజు గోడలు, గాజు పైకప్పుతో రూపొందించబడి ఉంటాయి. దీనివల్ల ప్రయాణికులు ట్రైన్ లోపల ఉంటూనే అది నడుస్తున్నప్పుడు, బయటి పరిసరాలన్నీ చూడొచ్చు. ఆకాశంలో మెరిసే నక్షత్రాలు, కదులుతున్న మేఘాలు, నిర్మలమైన ఆకాశం, విరబూసిన వెన్నెల, అలరించే అరోరా దృశ్యాలు.. ఇంద్ర ధనస్సు.. సహా పర్వతాల నడుమ అందమైన జలపాతాల దృశ్యాన్ని 360 డిగ్రీల కోణంలో స్పష్టంగా చూడవచ్చు. అసలే చలిగా ఉంటుంది. కాబట్టి ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తకుండా ట్రైన్ లోపల హీటెడ్ సీట్లు, బ్లాంకెట్లు, వెచ్చని వాతావరణం ఉండే ఏర్పాటు ముందుగానే సెట్ చేసి ఉంటాయి. కాబట్టి చలికి భయపడాల్సిన అవసరం కూడా ఉండదు.

ప్రకృతి ఆస్వాదనతో పరవశం..

ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు అందమైన ఆకాశం, కనువిందు చేసే మంచు పర్వాతాలు, అందమైన లోయలు, పారుతున్న జలపాతాల అద్భుత దృశ్యాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక ఈ ట్రైన్ పూర్తిగా శుభ్రమైన హైడ్రో ఎలక్ట్రిక్ శక్తితో నడుస్తుంది కాబట్టి పర్యావరణ అనుకూలమైనది కూడాను. ప్రయాణంలో ఉంటూ ప్రకృతి అందాలను, ఆకాశంలోని అరోరా దృశ్యాలను ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరూ మిడ్‌నైట్ అరోరా రూట్ ట్రైన్‌లో ఎంచక్కా జర్నీ చేయవచ్చు. ఒక్క టికెట్ ధర సుమారు రూ. 11,500 నుంచి 12, 000 వరకు ఉంటుందని పర్యాటక నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రయాణం కేవలం అరోరా చూడటమే కాకుండా, ఆర్కిటిక్ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే అరుదైన అవకాశాన్ని అందిస్తుంది, కాబట్టి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షిస్తున్న అత్యంత ప్రత్యేకమైన రైలు ప్రయాణాల్లో ఒకటిగా మారింది. నార్వే, ఐస్లాండ్, స్వీడన్, ఫిన్లాండ్, కెనడా, అలాస్కా వంటి ప్రాంతాల గుండా ట్రైన్ జర్నీ చేసే పర్యాటకులకు ఇదొక మధురమైన అనుభూతినిస్తుంది.

Next Story