- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హలో మిస్టర్ పర్ఫెక్ట్.. అంత పర్ఫెక్షనిజమ్ ప్రమాదమే.. పైగా..
మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకునేందుకు ఆరాటం చాలా మందిలో కనిపిస్తుంది. బంధువులు, బాస్, సహోద్యోగులు, స్నేహితులు ఇలా ప్రతిచోట, ప్రతి విషయంలో పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు. నిద్రలేచే టైమ్, స్లీపింగ్ పొజిషన్ నుంచి డైనింగ్ టేబుల్ ప్లేస్, మెనూ

దిశ, ఫీచర్స్ : మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకునేందుకు ఆరాటం చాలా మందిలో కనిపిస్తుంది. బంధువులు, బాస్, సహోద్యోగులు, స్నేహితులు ఇలా ప్రతిచోట, ప్రతి విషయంలో పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు. నిద్రలేచే టైమ్, స్లీపింగ్ పొజిషన్ నుంచి డైనింగ్ టేబుల్ ప్లేస్, మెనూ.. ఇన్‌టైమ్‌లో ఆఫీసుకు చేరడం, ప్రాజెక్ట్ పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేయడం.. ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో అందరికన్నా అన్నింట్లోనూ గొప్పగా ఉండాలనుకోవడం.. చివరకు ఓ చిన్న బొమ్మ గీసే విషయంలో.. హ్యాండ్ వాష్ చేసుకునే క్రమంలో కూడా ఇదే ఫాలో అయిపోవడం.. మొత్తానికి ఎలాంటి తప్పులు లేని, ఎవరు ఎత్తిచూపలేని పరిపూర్ణ జీవితాన్ని కోరుకోవడం అన్నమాట. కానీ ఇన్ని పర్ఫెక్ట్‌గా చేసే మనిషి జీవితంలో ప్రశాంతత ఎంత? ప్రతికూలతల ప్రమాదం ఎంత?
రీసెంట్ అధ్యయనం ప్రకారం 1989 నుంచి ఇప్పటి వరకు పర్ఫెక్షనిజమ్ అనేది అంటువ్యాధిగా పెరుగుతూనే వస్తుంది. ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. మెటా అనాలిస్ ఆఫ్ రేట్స్ ఆఫ్ పర్ఫెక్షనిజమ్ ప్రకారం... యూస్, యూకే, కెనడా లాంటి దేశాల్లో యావరేజ్ కాలేజ్ స్టూడెంట్‌లో భారీ మార్పు కనిపించింది. 1990 నుంచి 2000 ఏళ్ల మధ్యలో పర్ఫెక్షన్ టెండెన్సీస్ ఎక్కువైపోయాయి. దాదాపు ఐదుగురిలో ఇద్దరు ఇలా ఉండాలని కోరుకుంటున్నారు. పరిపూర్ణంగా ఉండాలనుకునే క్రమంలో తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటున్నారు. ప్రతికూల ఆలోచనలతో బాధపడుతున్నారు.
నిజానికి పర్ఫెక్షనిజమ్ వర్క్‌లో ప్రొడక్టివ్‌గా ఉండాలని, సక్సెస్ కావాలని అనుకునేదే కానీ ఈ క్రమంలో క్లినికల్ ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి. డిప్రెషన్, యాంగ్జయిటీ, సెల్ఫ్ హార్మ్, సోషల్ యాంగ్జయిటీ డిజార్డర్, ఈటింగ్ అండ్ స్లీపింగ్ డిజార్డర్స్, దీర్ఘకాలిక తలనొప్పి, బర్డెన్ ఫీలింగ్.. ఫైనల్లీ సూసైడ్ థాట్స్ వచ్చేస్తున్నాయి. ఎంత ఎక్కవ పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటే.. అంత ఎక్కువ సైకాలాజికల్ డిజార్డర్స్ ఎటాక్ చేస్తున్నాయి.
ఇద్దరు ఉద్యోగులను గమనించినప్పుడు పర్ఫెక్ట్‌గా ఉండాలనే వ్యక్తి ఎప్పుడూ సక్సెస్ మాత్రమే కోరుకుంటాడు. ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయలేడు. ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా కాకుండా కొంచెం అటు ఇటు అయినా కుంగిపోతాడు. కొలిగ్‌తో పోల్చినప్పుడు వెరీ స్ట్రెస్ సెన్సిటివ్‌గా ఉంటాడు. ఇది కూడా చేయలేకపోయాననే గిల్ట్, షేమ్‌తో బాధపడుతాడు. ప్రస్తుతం పదేళ్ల పిల్లల్లోనూ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్‌గా ఉండాలనే ఆందోళన ఎక్కువైపోయిందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.






