దయతో దీర్ఘకాలిక ఆరోగ్యం.. రుజువు చేసిన అధ్యయనం

by Dishanational4 |
దయతో దీర్ఘకాలిక ఆరోగ్యం.. రుజువు చేసిన అధ్యయనం
X

దిశ, ఫీచర్స్: 'దయ'.. ఇతరులను కష్టాల నుంచి కాపాడటమే కాదు మనను కూడా ఆనందంగా, ఆరోగ్యకరంగా ఉంచుతుందని తాజా అధ్యయనం రుజువు చేసింది. దయ తలచడం అనేది దాత, గ్రహీతలు ఇద్దరికీ మంచిదని నిర్ధారించింది. ఇతరుల నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసే 'పరోపకారం'.. బ్రెయిన్ యొక్క రివార్డ్ సెంటర్స్‌ను స్టిమ్యులేట్ చేసి, శరీరాన్ని ఫీల్ గుడ్ కెమికల్స్‌తో నింపేస్తుంది. అంటే వాలంటీర్‌గా పనిచేయడం ఒత్తిడిని తగ్గించి, నిరాశను మెరుగుపరచడానికి ఎలాగైతే ఉపయోగపడుతుందో.. అలాగే దయగా ఉండటం అనేది అనేక లాభాలను చేకూరుస్తుంది. ప్రపంచాన్ని దయామయంగా చేస్తున్న మీకు మీరే అద్భుతమైన బహుమతి పొందే ప్రదేశాన్ని నిర్మిస్తుంది.

సుదీర్ఘ జీవితం

సంతోషంగా ఉండటం వల్ల ఎక్కువ కాలం జీవించగలుగుతారనేది ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. కాబట్టి హ్యాపీగా ఉండటం నేర్చుకోవాలి. ఇతరుల పట్ల దయగా ఉండటం ఈ కోవకే చెందుతుండగా.. ఈ పని అభిజ్ఞా బలహీనతకు సంబంధించిన ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే కైండ్‌నెస్ సమాజంలో మార్పుకు కారణమవుతుంది. తద్వారా ఆనందం, ఆరోగ్యం, సుదీర్ఘ జీవితం లభిస్తుంది.

తక్కువ రక్తపోటు

ఆపదలో ఉన్న వారికి ఆర్థికంగా సహాయం చేయడం రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఒక అధ్యయనం హైపర్‌టెన్సివ్ వ్యక్తుల సమూహాన్ని తమ కోసం రూ. 3500 ఖర్చు చేసుకోవాలని కోరింది. అధిక రక్తపోటు ఉన్న మరొక సమూహాన్ని అదే డబ్బును ఇతరులకు ఖర్చు చేయమని సూచించింది. ఆరు వారాల ఈ అధ్యయనంలో ఇతరులకు డబ్బు ఖర్చు చేసేవారిలో రక్తపోటు తగ్గిందని గుర్తించారు. వాస్తవానికి ఈ ఫలితాలు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలకన్నా పెద్దవిగా ఉన్నాయి.

నొప్పి తగ్గింపు

దానం వల్ల మన బాధ తగ్గుతుంది. అనాథలకు సహాయం చేయడానికి డబ్బును విరాళంగా ఇస్తామని చెప్పిన వ్యక్తులు, ఇవ్వడానికి నిరాకరించిన వారి కంటే విద్యుత్ షాక్‌కు తక్కువ సున్నితంగా ఉంటారని తాజా అధ్యయనం కనుగొంది. తాము ఇచ్చే విరాళం వారికి సహాయకారిగా ఉంటుందని భావించిన వ్యక్తులు తక్కువ నొప్పిని అనుభవించారు. బాధాకరమైన స్టిమ్యులేషన్‌కు ప్రతిస్పందించే మెదడులోని ప్రాంతాలు దానం చేసిన అనుభవం వలన తక్షణమే నిష్క్రియం చేయబడతాయని, అందుకే ఇలా జరుగుతుందని అధ్యయనం కనుగొంది.

సంతోషం

దయతో మూడు రోజుల్లోనే సంతోషాన్ని పెంచవచ్చని UK పరిశోధకులు కనుగొన్నారు. అధ్యయనం ప్రజలను మూడు సమూహాలకు కేటాయించింది: మొదటి సమూహం ప్రతి రోజు దయతో కూడిన చర్యను చేయాల్సి ఉంటుంది; రెండవ సమూహం కొత్త కార్యాచరణను ప్రయత్నించాల్సి ఉంటుంది; మూడవ సమూహం ఏమీ చేయలేదు. వీరిలో దయగల, వినూత్నమైన పనులు చేసే సమూహాలు సంతోషంలో గణనీయమైన ప్రోత్సాహాన్ని పొందాయి. అంటే దయతో సృజనాత్మకంగా ఉంటే మరింత ఆనందాన్ని పొందుతారని హ్యాపీనెస్ రీసెర్చర్స్ సోంజా లియుబోమిర్స్కీ, కెన్నాన్ షెల్డన్ తెలిపారు. వారమంతా వివిధ రకాల దయతో కూడిన చర్యలను చేసిన వ్యక్తులు, అదే పనిని పదే పదే చేసే వారి కంటే సంతోషంలో ఎక్కువ పెరుగుదలను చూపించారని కనుగొన్నారు. ఈ చర్యలు అనామకంగా లేదా కనిపించేవిగా ఉన్నా.. ఆకస్మికంగా లేదా ప్రణాళికాబద్ధంగా జరిగినా.. సహాయం పొందినవారు మనపై పొగడ్తలు కురిపించడం సులభం అనేది గుర్తుంచుకోవాలి.

కైండ్‌నెస్ సజెషన్స్

* డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, మీ లేన్‌లోకి ప్రవేశించాలనుకునే కారుకు చోటు కల్పించండి.

* కుటుంబ సభ్యుడు, స్నేహితుడు లేదా సహోద్యోగికి నిజమైన అభినందన ఇవ్వండి.

* బాస్‌ను కూడా అభినందించండి. బహుశా వారు ఎప్పుడూ ఈ అనుభూతిని పొందలేకపోవచ్చు.

* పగ విడిచిపెట్టి క్షమించమని కోరండి.

* కష్టమైన సమయాన్ని ఎదుర్కొంటున్న స్నేహితుడికి అండగా ఉండండి. దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించవద్దు; కేవలం వినండి.

* మీ మెయిల్ క్యారియర్‌కు థాంక్యూ నోట్ ఇవ్వండి.

* మీ డెలివరీ వ్యక్తిని ఓవర్‌టిప్ చేయండి.

ఇవి కూడా చదవండి

వరల్డ్స్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ డ్రగ్.. ఒక్క డోస్‌ రూ. 28 కోట్లు

Next Story