దెబ్బతిన్న నరాలను పునరుద్ధరించే ఇంజెక్టబుల్ జెల్.. MIT శాస్త్రవేత్తల ఆవిష్కరణ!

by Javid Pasha |

శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఒక కొత్త ఇంజెక్టబుల్ జెల్ దెబ్బతిన్న నరాలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.

దెబ్బతిన్న నరాలను పునరుద్ధరించే ఇంజెక్టబుల్ జెల్.. MIT శాస్త్రవేత్తల ఆవిష్కరణ!
X

దిశ, ఫీచర్స్ : ప్రమాదాల్లో గాయపడినప్పుడో, ఏజ్ రిలేటెడ్ సమస్యలతోనో కొందరికి శరీరంలోని నరాలు దెబ్బతింటుంటాయి. ఇది పలు ఇతర అనారోగ్యాలకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. అయితే మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు దీనికి ఒక చక్కటి పరిష్కారం కనుగొన్నారు. నరాలను పునరుద్ధరించే ఇంజెక్టబుల్ జెల్‌ను అభివృద్ధి చేశారు. దీనిని ACES (Absorbable Conductive Electrotherapeutic Scaffolds) అని కూడా పిలుస్తున్నారు. ఇంతకీ ఇదెలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ కొత్త ఇంజెక్టబుల్ జెల్ దెబ్బతిన్న నరాలను మళ్లీ పెరిగేలా చేసి, కోల్పోయిన సెన్సేషన్(భావన)ను పూర్తిగా తిరిగి తెచ్చే సామర్థ్యం కలిగి ఉందని పరిశోధకులు అంటున్నారు. ఎందుకంటే ఇది బయోకాంపాటిబుల్ అని చెప్పవచ్చు. అంటే దీనిని శరీరానికి సరిపోయేలా సహజ కణజాలం మాదిరి మృదువుగా రూపొంచారు శాస్త్రవేత్తలు. ఈ జెల్‌ను ఇంజెక్ట్ చేసిన తర్వాత ఒక సపోర్టివ్ స్కాఫోల్డ్ స్ట్రక్చర్(సహాయక నిర్మాణం)గా మారి, నరాలలోని ఫైబర్స్‌ను, గ్యాప్‌లను పూడ్చేసి మళ్లీ కనెక్ట్ అయ్యేలా ప్రోత్సహిస్తుంది. తద్వారా శరీరం నేచురల్ హీలింగ్ ఎన్విరాన్మెంట్‌ను అనుకరిస్తుంది. అంటే దెబ్బతిన్న నరాలను రీజెనరేట్ చేస్తుంది.

ల్యాబ్ స్టడీస్‌లో (ప్రీక్లినికల్ యానిమల్ మోడల్స్‌లో) నరాలు తీవ్రంగా దెబ్బతిన్న జంతువులకు ఇంజెక్ట్ చేసినప్పుడు అద్భుతమైన రికవరీ కనిపించిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ జెల్ ఉపయోగించడానికి అందుబాటులో లేదు. ఇంకా ప్రారంభ దశ పరిశోధనల్లోనే ఉంది. భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే పెరాలిసిస్, వెన్నెముక గాయాలు, దీర్ఘకాలిక నరాల నొప్పి వంటి తీవ్రమైన సమస్యలకు మినిమల్ ఇన్వేసివ్ ఇంజెక్షన్ ద్వారా చికిత్స చేయవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.

Next Story