- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మధ్య వయసులో ఫిట్‌నెస్.. మహిళల్లో తగ్గుతున్న డెమెన్షియా రిస్క్!
స్వీడన్‌లో దశాబ్దాలపాటు కొనసాగిన ఒక అధ్యయనం ఫిజికల్ ఫిట్‌నెస్ అండ్ బ్రెయిన్ హెల్త్ మధ్య గల బలమైన సంబంధాన్ని వెల్లడించింది.

దిశ, ఫీచర్స్ : ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది మొత్తం మానసిక, శారీరక ఆరోగ్యానికి నిదర్శనంగా నిపుణులు పేర్కొంటారు. అయితే స్వీడన్‌లో దశాబ్దాలపాటు కొనసాగిన ఒక అధ్యయనం మరో కొత్త విషయాన్ని తెలిపింది. ఫిజికల్ ఫిట్‌నెస్ అండ్ బ్రెయిన్ హెల్త్ మధ్య గల బలమైన సంబంధాన్ని వెల్లడించింది. ఏంటంటే.. మిడిల్ ఏజ్‌లో శారీరక ఫిట్‌నెస్ కలిగిన మహిళల్లో డెమెన్షియా వచ్చే రిస్క్ 90% తగ్గుతుంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం!
అధ్యయనంలో భాగంగా నిపుణులు 40–60 ఏళ్ల మధ్య వయసు గల 191 మంది మహిళలను ట్రెడ్‌మిల్ టెస్ట్ ద్వారా ఫిట్‌నెస్ స్థాయి ఆధారంగా మూడు గ్రూపులుగా విభజించారు. అత్యధిక ఫిట్‌నెస్ (high fitness), మధ్యస్థ ఫిట్‌నెస్ (medium), తక్కువ ఫిట్‌నెస్ (low) కలిగిన వారు ఉన్నారు. అయితే 44 సంవత్సరాల ఫాలో- అప్‌లో, అత్యధిక ఫిట్‌నెస్ గ్రూపులో కేవలం 5% మందికి మాత్రమే డెమెన్షియా రాగా, తక్కువ ఫిట్‌నెస్ గ్రూపులో 32% వరకు, అలాగే మొత్తం సగటున 25% మందికి డెమెన్షియా సోకింది. కాగా మధ్య వయసులో అత్యధిక కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్ ఉన్న మహిళల్లో మెదడు ఆరోగ్యంగా ఉంటోందని, డెమెన్షియా వచ్చే ప్రమాదం సుమారు 90% తగ్గిందని నిపుణులు గుర్తించారు. Link






