- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గత దశాబ్దం కంటే కూడా ఎత్తు, బరువు పెరుగుతున్న మానవులు.. మహిళలకంటే పురుషులే ఎక్కువ..!
అధ్యయనంలో భాగంగా బ్రిటన్, ఇటలీ, అమెరికా దేశాలకు చెందిన పరిశోధకులు 69 దేశాల నుంచి 2023 నాటి డబ్ల్యుహెచ్ఓ(WHO) డేటా నుంచి 135,645 మంది స్త్రీ, పురుషుల డేటాను విశ్లేషించింది.

దిశ, ఫీచర్స్ : ఇది విన్నారా..! అంతకు ముందు కాలంతో పోలిస్తే గత శతాబ్దంతో మానవుల సాధారణ ఎత్తు, బరువులలో పెరుగుదల కనిపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. సామాజిక- ఆర్థిక పరిస్థితులు మెరుగు పడటమే ఇందుకు కారణమని చెబుతున్నాయి. అయితే ఈ హైట్ అండ్ వెయిట్ పెరుగుదల మహిళలకంటే పురుషుల్లో రెట్టింపుగా ఉందని, ఇంకా లైంగిక ఎంపిక(సెక్సువల్ సెలెక్షన్) కారణంగా ఇది వేగంగా జరిగిందని బయాలజీ లెటర్స్ జర్నల్‌లో పబ్లిషైన అధ్యయనం పేర్కొన్నది.
అధ్యయనంలో భాగంగా బ్రిటన్, ఇటలీ, అమెరికా దేశాలకు చెందిన పరిశోధకులు 69 దేశాల నుంచి 2023 నాటి డబ్ల్యుహెచ్ఓ(WHO) డేటా నుంచి 135,645 మంది స్త్రీ, పురుషులు( పురుషులు 46%), అలాగే 1905-1958 మధ్య కాలానికి సంబంధించిన యూకే చారిత్రక రికార్డుల నుంచి 49,180 మందికి సంబంధించిన డేటాను విశ్లేషించారు. హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ (HDI– ఆయుష్షు, విద్య, ఆదాయం ఆధారంగా 0-1 స్కోర్) పెరగడంతో ఈ ఎత్తు-బరువు పెరగడమనే మార్పులు సంభవించినట్లు వారు కనుగొన్నారు. అయితే ఇది కేవలం ఆహారం, ఆరోగ్య సేవల మెరుగుదల వంటి వాటివల్ల మాత్రమే కాకుండా, మహిళల లైంగిక ఆకర్షణ (Choosing men with short thighs and tall stature) కారణంగా మగవారి శరీరం మారిందని సూచిస్తుంది.
అధ్యయనం ప్రకారం హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ (HDI)లో ప్రతి 0.2 పాయింట్ల పెరుగుదలకు, మహిళలు సగటుగా(On average) 1.7 సెం.మీ. ఎత్తు, 2.7 కేజీల బరువు పెరిగారు. కానీ మగవారు 4 సెం.మీ. ఎత్తు, 6.5 కేజీలు బరువు పెరిగారు. అంటే.. ఇక్కడ పురుషుల్లో ఎత్తు బరువు మహిళలకంటే రెట్టింపు అయింది. యూకేలో 1900లో HDI 0.8 నుంచి 2022లో 0.94కి పెరిగినప్పుడు, మహిళలు 5 సంవత్సరాలకు 0.25 సెం.మీ. ఎత్తు పెరిగారు. అదే సందర్భంలో పురుషులు 0.69 సెం.మీ. పెరిగారు. గినీ ఇండెక్స్ (Economic inequality)పెరిగినప్పుడు ఎత్తు-బరువు తగ్గుతుందని కూడా పరిశోధకులు కనుగొన్నారు. అప్పుడు మహిళలు 0.14 సెం.మీ., మగవారు 0.31 సెం.మీ. తగ్గుతారు. కాగా ఈ విధమైన ఎత్తు, బరువు పెరుగుదల మార్పులు ఐరోపా, ఆసియాలో ఎక్కువ కనిపించగా.. ఆఫ్రికా, దక్షిణాసియాలో తగ్గుదల కనిపించిందని అధ్యయనం పేర్కొన్నది.






