- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలాంటి స్త్రీలే కావాలంటున్న పురుషులు.. ఆ విషయంలో Expectations ఎలా ఉన్నాయంటే..
అలాంటి స్త్రీలే కావాలంటున్న పురుషులు.. ఆ విషయంలో Expectations ఎలా ఉన్నాయంటే..

దిశ, ఫీచర్స్ : జీవిత భాగస్వామి లేదా తాత్కాలిక శృంగార భాగస్వామి కోసం, లవ్ అండ్ రిలేషన్షిప్ కోసం చాలా మంది స్త్రీ, పురుషులు డేటింగ్ యాప్‌లలో సెర్చ్ చేస్తుంటారు. అయితే పార్ట్నర్ విషయంలో ఎవరు ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి ఉద్దేశంతో సెర్చ్ చేస్తున్నారు? అంటే.. 80 % మహిళలు తమకంటే అందమైన, ఆకర్షణీయమైన పురుషుల కోసం వెతుకుతారని, పైగా వీరు హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉంటారనే థియరీ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. కానీ.. రీసెంట్ స్టడీ మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలను కనుగొన్నది. ఏంటంటే.. స్త్రీలకంటే కూడా పురుషుల్లోనే మహిళల పట్ల ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్(Expectations) ఉంటున్నాయని చెబుతోంది.
చెక్ రిపబ్లిక్‌లోని ఒక డేటింగ్‌యాప్ 10,528 మంది దాని యూజర్లపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. డేటింగ్ యాప్‌లలో 80% మహిళలు అందం, ఆస్తి, ఆకర్షణ, శృంగారం వంటి విషయాల్లో టాప్ 20% పురుషుల కోసం మాత్రమే స్వైప్ చేస్తారనే అంచనాలు, ప్రచారాలు ఇప్పటి వరకు ఉన్నాయి. కానీ అది నిజం కాదని తాజా అధ్యయనంలో తేలింది. నిజానికి ఇది పురుషులు చేస్తున్నారని పేర్కొన్నది. ప్రేమ కోసం స్వైప్ చేస్తున్నప్పుడు వాస్తవానికి 80% పురుషులే ఎక్కువ ఆశలతో, ఎక్కువ అంచనాలతో (high expectations) స్వైప్ చేస్తున్నారు. ముఖ్యంగా తాము డేటింగ్ కోసం ఎంపిక చేసుకునే మహిళ, తమకంటే అందంగా, అట్రాక్టివ్‌గా, సెక్సీగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక ఈ అంచనాల్లో కేవలం 27% నుంచి 38% స్వైప్‌లు మాత్రమే రెండు వైపులా సక్సెస్ఫుల్ మ్యాచ్‌లుగా మారుతున్నాయి.






