Shopping : వామ్మో.. గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి షాపింగా..! 26 నిమిషాలకే బోర్‌గా ఫీలవుతున్న పురుషులు!

by Javid Pasha |

Shopping : వామ్మో.. గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి షాపింగా..! 26 నిమిషాలకే బోర్‌గా ఫీలవుతున్న పురుషులు!

Shopping : వామ్మో.. గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి షాపింగా..! 26 నిమిషాలకే బోర్‌గా ఫీలవుతున్న పురుషులు!
X

దిశ, ఫీచర్స్ : షాపింగ్ చేయడమంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి! పైగా అదొక అవసరంతో పాటు సరదా కూడాను అంటుంటారు చాలా మంది. అందుకే నిత్యావసరాలు మొదలు కొని ఫ్యాషన్ దుస్తుల వరకు అవసరమైనవన్నీ కొనడానికి ఆసక్తి చూపడం సహజమే. అయితే కొన్ని సందర్భాల్లో షాపింగ్ చేయడం కూడా చికాకు తెప్పిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్ లేదా భాగస్వామితో కలిసి షాపింగ్ చేసే సందర్భంలో పురుషులు 26 నిమిషాలకే బోర్‌గా ఫీలవుతారని పేర్కొన్నది.

షాపింగ్ హాబిట్స్ కూడా అందరిలో ఒకే విధంగా ఉండవు. కొందరు నేరుగా షాపింగ్ మాల్స్‌కి వెళ్లి కొనడానికి ఇష్టపడితే, మరికొందరు కొందరు ఆన్‌లైన్‌లో షాపింగ్(Online shopping) చేయడానికి ఆసక్తి చూపుతారు. ఏ విధంగా చేసినా ఇక్కడ అవసరంతో పాటు సరదా, సంతోషం వంటి అంశాలు కూడి ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా నేరుగా మాల్స్‌కి వెళ్లి షాపింగ్ చేయడాన్ని అందరూ ఇష్టపడినప్పటికీ పురుషులతో పోలిస్తే స్త్రీలే ఈ విషయంలో ఎక్కువ క్యూరియాసిటీ ప్రదర్శిస్తారని అధ్యయనాలు పేర్కొ్ంటున్నాయి. అయినప్పటికీ ఎక్కువసేపు షాపింగ్ చేయడమనేది అలసటకు దారితీస్తుంది. ఈ విషయంలోనూ స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసముందని అధ్యయనం పేర్కొన్నది.

పురుషులు తమ ప్రియురాలు లేదా భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తున్నప్పుడు(Shopping with a girlfriend or partner) 26 నిమిషాలకే బోర్‌గా ఫీలవుతారని, స్త్రీలు మాత్రం సుమారు 2 గంటలపాటు ఏమాత్రం అలసిపోకుండా షాసింగ్‌లో నిమగ్నమవుతారని తాజా అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు చెబుతున్నారు. మరో విషయం ఏంటంటే.. సుమారు 80% మంది పురుషులు తమ భాగస్వాములతో షాపింగ్ చేయడాన్ని పెద్దగా ఇష్టపడరట. ఈ కారణంవల్ల కూడా పురుషులు తమ ప్రియురాలు లేదా భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తున్నప్పుడు 26 నిమిషాలకే విసుగు చెందుతారని(Men get tired in just 26 minutes when shopping with their girlfriend or partner), ఆ తర్వాత ఫోన్‌‌చెక్ చేయడంలో నిమగ్నమవడం, ఏ వస్తువు కొనాలనే విషయంపట్ల ఆసక్తిగా ఉండకపోవడం వంటి బిహేవియర్‌ను ప్రదర్శిస్తారని అధ్యయనం పేర్కొన్నది.

Next Story