- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సొంతగా ఐస్‌క్రీమ్ ఆర్డర్ ఇచ్చుకున్న కుక్క.. నెట్టింట ఎంత ముద్దో..!
షేరింగ్‌లతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. Popular Dog orders her own ice cream at shop.

X
దిశ, వెబ్‌డెస్క్ః కుక్కల వీడియోలు ఎంత ముద్దుగా ఉంటాయో జంతు ప్రియులకు ప్రత్యేకంగా చెప్పే అవసరంలేదు. వాటిని చూడటం ఇష్టపడే వారైతే, మీకా అనే సూపర్ కుక్క క్యూట్ చర్యలు ఇప్పటికే మీకు తెలిసి ఉండవచ్చు. ఈ సైబీరియన్ హస్కీ, కుక్కకు స్వంత ఇన్‌స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది. ఈ అందమైన డాగ్ వైరైటీ సాహసాలను చూపించే వివిధ వీడియోలు తన ఇన్‌స్టా పేజీలో ఎంతోమందిని ఆకర్షించాయి. ఇక, తాజాగా పంచుకున్న ఈ వీడియోలో, మీకా ముద్దుముద్దుగా ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేయడం కనిపించింది. తనంతట తానుగా ఒక షాపులో ఐస్ క్రీం ఆర్డర్ చేయడాన్ని చూసి, జంతు ప్రేమికులైన నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే పదుల వేలు దాటిన వ్యూవ్స్, షేరింగ్‌లతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Next Story






