పచ్చిబఠాణీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! ఏంటో తెలుసా?

by Disha Web Desk 9 |
పచ్చిబఠాణీతో  ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! ఏంటో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: పచ్చి బఠాణీలు అన్ని రకాల విటమిన్లు కలిగి ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, తో పాటుగా ఎన్నో రకాల విటమిన్లు కూడా ఉంటాయి. అంతేకాదు.. పచ్చి బఠాణీలు ఫైబర్, పొటాషియం, జింక్‌కు మంచి మూలం కూడా. ఇవి ఫుడ్ రుచిని పెంచడమే కాకుండా.. మన శరీరానికీ ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. చలికాలంలో ఈ బఠాణీలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. వీటిలో విటమిన్ బి6, విటమిన్ సి, ఫోలేట్ (ఫోలిక్ యాసిడ్) వంటి పోషకాలు చర్మానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. అలాగే పచ్చి బఠాణీల్లో నియాసిన్ పుష్కలంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికీ గానూ ఎంతగానో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వారంలో కనీసం రెండు, మూడు సార్లు తినడానికీ ప్రయత్నించండి.

Also Read...

ఫ్రెంచ్ ఫ్రైస్‌తో డిప్రెషన్.. యువకులే బాధితులు..

Next Story

Most Viewed