Valentine's Day : మహేష్ బాబు-నమ్రత రొమాంటిక్ లవ్ స్టోరీ.. పెళ్లి మాత్రం వద్దని..

by Sujitha Rachapalli |

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ఈ మధ్యే 20వ పెళ్లి రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భార్యకు విషెస్ చెప్తూ అమేజింగ్ పోస్ట్ పెట్టాడు మన ప్రిన్స్.

Valentines Day : మహేష్ బాబు-నమ్రత రొమాంటిక్ లవ్ స్టోరీ.. పెళ్లి మాత్రం వద్దని..
X

దిశ, ఫీచర్స్ : సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ఈ మధ్యే 20వ పెళ్లి రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భార్యకు విషెస్ చెప్తూ అమేజింగ్ పోస్ట్ పెట్టాడు మన ప్రిన్స్. ఇద్దరు పిల్లలతో సూపర్ హ్యాపీ పేరెంట్స్‌గా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న వీరిద్దరి పెళ్లి.. అంత సులభంగా ఏమీ కాలేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని, అన్నింటిని తట్టుకుని నిలబడితేనే ఒక్కటయ్యారు. ఇంతకీ మన సూపర్ స్టార్ సూపర్ హిట్ లవ్ స్టోరీ ఏంటో వాలెంటైన్స్ డే స్పెషల్‌‌గా మీకోసం.

నమ్రత 1993లో మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. 1998లో బాలీవుడ్ కెరీర్ స్టార్ట్ చేసింది. ‘జబ్ ప్యార్ కిసీసే హోతా హై’ తన తొలి సినిమా కాగా ఇందులో సల్మాన్ ఖాన్ సరసన మెరిసింది. మంచి గుర్తింపు సంపాదించింది. ఇక అప్పటికే చైల్డ్ ఆర్టిస్టుగా మన్ననలు పొందిన మహేష్ బాబు.. 1999లో ‘రాజ కుమారుడు’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. 2000లలో ‘వంశీ’ మూవీ హీరోహీరోయిన్లుగా ప్రిన్స్, నమ్రత ఫైనల్ అయ్యారు. పూజా కార్యక్రమం రోజు మొదటిసారి కలుసుకున్నప్పుడే ఒకరికొకరు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకున్నారట. కానీ ఇదంతా అట్రాక్షన్ అని లైట్ తీసుకున్నారట. అయితే షూటింగ్ సమయంలో ఇద్దరు ఒకరి పక్కన మరొకరు ఉంటూ.. అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత స్ట్రాంగ్ రిలేషన్‌లోకి వచ్చేశారు. ఇది లవ్ అని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

ఈ క్రమంలో ఇంట్లో ఈ విషయాన్ని చెప్పాలనుకున్న మహేష్ ఒక దగ్గర భయపడిపోయాడు. అది నమ్రత తనకన్నా నాలుగేళ్లు పెద్దది కావడం. అందుకని డైరెక్ట్ పెద్దలకు చెప్పకుండా తన అక్క మంజుల సహాయాన్ని తీసుకున్నాడట మహేష్. ఆమె తల్లిదండ్రులను ఒప్పించడంలో హెల్ప్ చేసిందట. దాదాపు నాలుగేళ్లు ఈ ప్రాసెస్ జరిగినా.. నమ్రత, మహేష్ ఒకరికొకరు కమిటెడ్‌‌గా ఉన్నారు. ఈ లాంగ్ డిస్టేన్స్ ఫేజ్‌లో కేవలం అకేషనల్‌గా మాత్రమే కలుసుకున్నారు. మొత్తానికి అక్క సపోర్ట్‌తో ఇంట్లో అందరు ఒప్పుకోగా.. ఫిబ్రవరి 10, 2005న పెళ్లి చేసుకున్నారు సూపర్ కపుల్. ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్ అటెండ్ అయిన మ్యారేజ్‌ ఘనంగా జరిగింది. ఆ తర్వాత నమ్రత కెరీర్‌ను త్యాగం చేస్తూ.. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో మహేష్‌కు సపోర్ట్‌గా ఉంటూ వస్తోంది.

Next Story