- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ కళాత్మక దృశ్యం వెనుక.. హృదయాలను కదిలించే విషాద గాథ!
ఒంటరి తనం బాధిస్తుందనేది వాస్తవమే కావచ్చు. కానీ.. ఆమెలోని తనలోని సృజనాత్మకతను బయటకు తీసేందుకు అవకాశంగా మలచుకున్నది.

దిశ, ఫీచర్స్ : ఒంటరి తనం వేధిస్తుందనే మాట నిజమే కావచ్చు. కానీ.. ఆమె తనను తాను తీర్చిదిద్దు కోవడానికి ఉపయోగించుకున్నది. ఒంటరి తనం బాధిస్తుందనేది వాస్తవమే కావచ్చు. కానీ.. ఆమెలోని తనలోని సృజనాత్మకతను బయటకు తీసేందుకు అవకాశంగా మలచుకున్నది. జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు కొన్నిసార్లు భయంకరంగా ఉండవచ్చు.. కానీ ఆమె మాత్రం వాటితో చివరిదాకా పోరాడి గెలిచింది. ఒంటరితనాన్ని, కష్టాలను అనుకూలంగా మల్చుకుని, కళాకారిణిగా ఎదిగింది. అందుకే ఆమె లేకపోయినా ఆమె ఆదర్శాలు మిగిలాయి. ఆమె కళాకృతులు ఎందరినో అలరిస్తున్నాయి. ఇంతకీ ఎవరామె?
పేరు సోనాబాయి రాజ్ వార్(1930-2007). ఛత్తీస్‌గఢ్‌లోని సూర్జా జిల్లా పుహ్‌పుత్ర (Puhputra) అనే చిన్న గ్రామానికి చెందిన ఈ మగువ రాజవార్ కమ్యూనిటీకి చెందిన ఒక పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టంది. 16 మంది కుటుంబ సభ్యులతో కలిసి గ్రామీణ వాతావరణంలో సంతోషంగా, సంప్రదాయ బద్ధంగా పెరిగింది. అయితే అప్పట్లో చాలా వరకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేవారు. సోనాబయి పెళ్లి కూడా ఆమె 13-15 ఏళ్ల మధ్యలోనే జరిగింది. ఆమెకంటే పదేళ్ల పెద్ద వయసుగల వ్యక్తితో వివాహం జరిపించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. సూర్జా జిల్లాలో ఆమెను ఆదర్శ మహిళగా, ఆ ప్రాంతంలో చారిత్రాత్మక, కళా సాంస్కృతిక వారసత్వ నిర్మాతగా భావిస్తుంటారు. చాలామంది ఇళ్లల్లో ఆమె చిత్ర పటాలు దర్శనమిస్తుంటాయి.
కళ వెనుక.. విషాద గాథ
సోనాబాయి రాజ్‌వార్‌ను ఛత్తీస్‌గఢ్‌లోని అనేక ప్రాంతాలలో అలానాటి సంప్రదాయ ఒక కళాకారిణిగా, శిల్పకారిణిగా, చిత్రకారిణిగా ఆరాదిస్తారు. అయితే ఈ కళాత్మక దృశ్యం వెనుక హృదయాలను కదిలించే ఆమె విషాద గాథ దాగుంది. ఏంటంటే.. ఆమెను భర్త తనకంటే చాలా పెద్ద వయసులో ఉన్న వ్యక్తే కాకుండా తరచుగా ఆమెను అవమానించడం, వేధించడం చేసేవాడు. చాలా ఆర్ష్య పరుడిగా కూడా పేర్కొంటారు. పెళ్లి తర్వాత మొదట పదేళ్ల పాటు వీరికి సంతానం కలుగకలేదు. అప్పట్లో శాస్త్రీయ పరిజ్ఞానం పట్ల అవగాహన లేకపోవడం, మూఢ నమ్మకాలు, సామాజిక ఒత్తిళ్ల ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేది. అయితే సంతానం కలుగకపోవడానికి సోనాబయి రాజ్‌వార్‌దే తప్పు అన్నట్లు ఆమె భర్త భావించాడు. దీంతో వేధించడం మొదలు పెట్టాడు. ఆమె తన తల్లిగారింటికి, అలాగే ఇతర వ్యక్తులతో మాట్లాడకుండా కేవలం ఇంటిలోనే ఒక గదిలో ఉండాలని హుకూం జారీ చేశాడు. కేవలం భర్తతో మాత్రమే మాట్లాడే అవకాశం ఉండేది.
ఒంటరితనం నుంచి సృజనాత్మకత..
కొన్ని రోజులకు సోనాబాయికి ఒక కొడుకు (దరోగా రామ్) పుట్టినా ఆమె పట్ల భర్త ఈర్ష్య, అనుమానం, పైశాచికత్వం, ఆధిపత్య ధోరిణి పోలేదు. దీంతో ఆమెను కిటికీలు లేని ఆ ఇంటిలోపలే కొడుకుతోపాటు బంధించి ఉంచాడు. కేవలం సమయానికి తిండి పెట్టేవాడు. ఆమె కేవలం తన కొడుకు, భర్త మొహం తప్ప ఇంకెవరినీ చూడటానికి వీల్లేదని చెప్పేవాడు. అప్పట్లో పురుషాధిపత్యం ఎక్కువగా ఉండేది. భర్తలు ఇబ్బంది పెట్టినా చాలామంది మహిళలు మౌనంగా భరించేవారు. సోనాబయి దాదాపు అదే చేసింది. అయితే ఇలాంటి బాధాకరమైన పరిస్థితిని కూడా సోనాబాయి తనలోని సృజనాత్మకతను బయటకు తీసేందుకు వినియోగించుకుంది. గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు మానసికంగా ఇబ్బంది పడినా వెంటనే తేరుకొని గదిలోని మట్టి గొడలపై ఊహా చిత్రాలు గీసేది, బొమ్మలు చెక్కేది. ఆ ఒంటరి గదిలోనే తన కొడుకు ఆడుకోవడానికి మట్టితో బొమ్మలు తయారు చేసేది.
కళాఖండాల సృష్టి..
గదిలో ఒంటరిగా ఉంటున్న సోనాబాయి రాజ్‌వార్ మట్టితో బొమ్మలు చేయడం, గోడలపై శిల్పాలు, బొమ్మలు, పలు రకాల ఆకృతులు చెక్కడం ప్రారంభించించింది. ఈ కృషి ఆమెను ఒక కళాకారిణిగా, శిల్పకారిణిగా తీర్చిదిద్దాయి. మట్టి గోడలపై అద్భుతమైన శిల్పాలు, సుందరమైన రిలీఫ్ ఆర్ట్, రకరకాల కళాఖండాలను ఆమె సృష్టించసాగింది. ఈ మట్టి కళ మొత్తం ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌వార్ శైలికి ప్రేరణగా నిలిచింది. ఎంతోమంది ఆమె గీసిన, తయారు చేసిన, చెక్కిన మట్టి బొమ్మలు, శిల్పాలు చూసి ఆశ్చర్యపోయారు. ఇతరులు ఇళ్లు కట్టినప్పుడు, బొమ్మలు తయారు చేసేటప్పుడు ఆమె కళను అనుసరించడం మొదలు పెట్టారు. తర్వాత ఆమె భర్త మారిపోయి, ఆమెను బాగా చూసుకోవడం మొదలు పెట్టాడు.
మట్టికళ ఉట్టిపడేలా..
చివరికి 2007లో సోనాబాయి రాజ్‌వార్ మరణించింది. కానీ ఆమె సృష్టించిన ‘మట్టి కళ’ మాత్రం నలుదిశలా వ్యాపించింది. ఇప్పటికీ సజీవంగా ఉంది. అనేకమంది దానిని అనుసరిస్తున్నారు. పురాతన చిత్రకళ, శిల్పకళగా భావించడమే కాకుండా సోనాబాయిని, చారిత్రక, సాంస్కృతిక కళాకారణిగా పుహ్‌పుత్ర (Puhputra) గ్రామస్తులు నమ్ముతుంటారు. కొందరు ఇబ్బందులను కూడా ఎలా అవకాశంగా మలచుకొని, ఇతరులను ప్రభావితం చేస్తారో, ఆదర్శంగా నిలుస్తారో, ప్రేరణగా మారుతారో చెప్పడానికి సోనాబాయి రాజవార్ జీవితమే ప్రత్యక్ష ఉదాహరణగా అక్కడి పెద్దలు, ప్రజలు పేర్కొంటారు.






