‘ఏడాదిలో కనీసం ఒక్క మొక్క అయినా నాటుదాం’

by Disha Web Desk 9 |
‘ఏడాదిలో కనీసం ఒక్క మొక్క అయినా నాటుదాం’
X

దిశ, వెబ్‌డెస్క్: ‘‘మనం ప్రకృతి భక్షణకై కాదు, రక్షణకై పుట్టాం.. బాధ్యత నేరవేర్చుదాం. భావి తరాలకు పచ్చని బతుకునిద్దాం.’’ ప్రకృతి తల్లి ప్రాముఖ్యతను వివరించడానికి, ప్రజలందరికీ అవగాహన పెంచడానికి ప్రతి ఏటా నేడు జూన్-5వ తేదీన ప్రపంచ ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్లాస్టిక్ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, సముద్ర మట్టం రోజురోజుకూ పెరుగుతుండడం వంటి సమస్యలను ప్రపంచం ఎదుర్కొంటుందని 1972లో ‘‘స్టాక్ హెూమ్ కాన్ఫరెన్స్’’ సమయంలో యూఎన్ జనరల్ అసెంబ్లీ స్థాపించడం జరిగింది.

ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్ ‘‘ఒకే భూమి’’ ప్రకృతిని మరియు జీవితాన్ని రక్షించడం ద్వారా శాంతి, సామరస్యం, శ్రేయస్సు, ఆరోగ్యానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే దిశలో ప్రపంచ ఐక్యతపై దృష్టి పెట్టడం ‘‘ఒకే భూమి’’ లక్ష్యం. ప్రకృతిని తల్లిని కాపాడేందుకు 50 సంవత్సరాల క్రితం మోటో ఇప్పటికీ అలానే ఉంది. ఈ గ్రహం మన ఏకైక ఇల్లు. రాబోయే తరాల కోసం మనం దాన్ని రక్షించుకోవాలి. పర్యావరణం అత్యంత కలుషితమై విషపదార్థాలతో నిండిపోయింది. ఇది మన ఆరోగ్యంపై ప్రమాదకరమైన ప్రభావం చూపుతుంది. కాబట్టి మనమందరం కలిసి ప్రకృతిని కాపాడుకుందాం.

ఈ చిన్న బాధ్యతలు నెరవేర్చుదాం..

* ఒక ఏడాదిలో కనీసం ఒక మొక్క అయినా నాటండి.

* ప్లాస్టిక్ వాడకాన్ని ఆపాలి.

* చెరువుల్లో, నదుల్లో, సముద్రంలో చెత్త వెయ్యకండి.

* ఒక్కొక్క నీటి చుక్కను మన రక్తపు బొట్టులా కాపాడుకోండి.

* నదుల్లోకి ఆమ్లాలు, రసాయనాలు వెళ్లనివ్వొద్దు.

* మన సమాజాన్ని శుభ్రంగా ఉంచడానికి, పరిశుభ్రతను కాపాడుకోవడానికి తప్పక చొరవ తీసుకోండి.

Also Read: Home Tips: వీటి గురించి తెలియక మనం ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డామో?

Next Story

Most Viewed