- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: కింగ్ కోబ్రా vs పైథాన్..ఈ పోరాటంలో కింగ్ ఎవరో తెలుసా బ్రో
Viral Video: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇటీవలి కాలంలో ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం భయబ్రాంతులకు గురు చేస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియో పాతదే కావచ్చు..కానీ కింగ్ కోబ్రా..పైథాన్ మధ్య భీకర పోరాటం చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది.
వీడియోను చూస్తే ఓ చిన్న నీటికాల్వలో భారీ కింగ్ కోబ్రా, పైథాన్ ఎదురుపడతాయి. ముందు కాలువపై ఉన్న కింగ్ కోబ్రా..పైథాన్ పై దాడి చేస్తుంది. దీంతో కొండచిలువ పారిపోతుంది. మళ్లీ తిరిగి వచ్చి రెండు పాములు ఒకదానిపై మరొకటి దాడికి దిగుతాయి. కొండచిలువను కింగ్ కోబ్రా కాటేస్తుంది. దీంతో పైథాన్ కింగ్ కోబ్రాను చుట్టుకుని దానిపై దాడి చేస్తుంది. కింగ్ కోబ్రాకు తల దొరకకుండా కొండచిలువ తప్పించుకుని మళ్లీ ఎదురుదాడి చేస్తుంది.
కొండచిలువ చుట్టేసినా..భారీ కింగ్ కోబ్రా దాన్ని క్రూరంగా కరుస్తూ దాడి చేస్తుంది. కొన్ని నిమిషాల పాటు రెండింటి మధ్య భీకర పోరాటం జరుగుతుంది. కింగ్ కోబ్రా దాడిని తట్టుకోలేకపోయిన పైథాన్..అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతుంది. దాంతో కింగ్ కోబ్రా కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీనికి సంబంధించి వీడియోను ఓ యూట్యూబ్ ఛానెల్ అప్ లోడ్ చేసింది.






