14 ఏళ్లకే రికార్డ్.. బెస్ట్ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్.!

by Daayi Srishailam |

మార్కులే కాదు. నైపుణ్యముంటే ఏదైనా సాధించొచ్చు

14 ఏళ్లకే రికార్డ్.. బెస్ట్ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్.!
X

దిశ, ఫీచర్స్: ఇంజినీరింగ్ పూర్తిచేసి.. స్కిల్స్ లేక లక్షలాది మంది యువత ఉద్యోగాల్లేకుండ ఖాళీగా కూర్చుంటున్నారు. చదువంటే సర్టిఫికేట్స్, మార్కులే కాదు. నైపుణ్యముంటే ఏదైనా సాధించొచ్చు. 14 ఏళ్లకే అలాంటి ప్రతిభను చాటి రికార్డు సృష్టించాడు కోయంబత్తూర్ అబ్బాయి కేశవ్ విక్రమ్.

ఎలుగుబంటి క్యాప్చర్..

కేశవ్.. సముద్రాలు దాటి రష్యా తీరప్రాంతంలోని కమ్చట్కాలో మంచు పర్వతాల్లో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీని ఎంచుకున్నాడు. ఆ సమయంలో మనోడికి బ్రౌన్ బియర్ కనిపించింది. ఇది యురేషియా, ఉత్తర అమెరికాల్లో నివసించే అతిపెద్ద ఎలుగుబంటి. ఇవెంత పెద్దగా ఉంటాయంటే.. వాటి ఎత్తు ఎనిమిది అడుగులు ఉంటాయి. అంటే మనిషికంటే ఎత్తు అన్నమాట. ఇక బరువు విషయయానికొస్తే సుమారు 700 పౌండ్లు ఉంటాయి. వీటిని చూస్తే భయపడతారు. అలాంటిది కేశవ్ అది సరస్సు ఒడ్డున నడుస్తుంటే క్యాప్చర్ చేశాడు. అదే యాంగిల్‌లో స్లేటీ బ్యాక్డ్ గుల్ అనే పక్షి ఎగిరి.. రెండూ ఒకే ఫ్రేమ్‌లో వచ్చాయి.

తొమ్మిదో తరగతి స్టూడెంట్..

పిల్లలంతా బుక్స్, క్రికెట్‌తో కుస్తీ పడుతుంటే కేశవ్ విక్రమ్ ప్రతీక్షణం ప్రకృతి గురించి ఆలోచించేవాడు. చదివేది తొమ్మిదో తరగతే అయినా తన ధ్యాసంతా కెమెరా లెన్స్ గురించే. అది క్రమంగా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీపై ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది. తన ఆసక్తిని గమనించిన పేరెంట్స్, టీచర్స్ ప్రతీ సందర్భంలో ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. కేశవ్ హాబీ క్రమంగా కెరీర్‌ను బిల్డ్ చేసుకునే స్టేజ్‌కి వెళ్లింది. తన టాలెంట్ ఏంటో నిరూపించుకునేందుకు కమ్చట్కా వైల్డర్‌నెస్‌ను ఆప్షన్‌‌‌గా తీసుకున్నాడు. ఫొటోగ్రఫీ అంటే కేవలం అందమైన చిత్రాలను తీయడం కాదు.. ప్రకృతి రహస్యాలను బయటపెట్టడం అని చిన్న వయసులో పెద్ద కల కన్నాడు.

60636 ఎంట్రీలలో..

లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో వైల్డ్ లైఫ్ పొటో ఆఫ్ ది ఇయర్-2025 కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. దీనికి 60636 ఎంట్రీలు వచ్చాయి. వీటిలో నుంచి బెస్ట్ ఫొటోగ్రఫీ కేటగిరీలో నామినేట్ అయింది కేశవ్ క్యాప్చర్ చేసిన "ఎసెన్స్ ఆఫ్ కమ్చట్కా" ఫొటో. చూడటానికి ఇదొక సాదాసీదా ఫొటోనే కావచ్చు. కానీ.. అది ప్రకృతి అద్భుతాలరె ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పింది. ప్రొఫెషనల్ యంగ ఫొటోగ్రాఫర్ల కెరీర్‌కు ఈ పోటీలొక మైలురాయి వంటివి. ఫైనల్ ఫలితాలు అక్టోబర్ 14వ తేదీన ప్రకటిస్తారు. ఎంపికైన ఉత్తమ చిత్రాల ప్రదర్శన అక్టోబర్ 17 వరకు ఉంటుంది. దాంట్లో కేశవ్ ఫొటో ఉంటుంది.

Next Story