Little millet: వారానికి 2 సార్లు ఈ అన్నం తింటే చాలు.. !

by Kanadam.Hamsa lekha |

ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.

Little millet: వారానికి 2 సార్లు ఈ అన్నం తింటే చాలు.. !
X

దిశ, ఫీచర్స్: ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. చాలామంది ఆఫీస్‌కి లేట్ అవుతుందని మార్నిగ్ టైమ్‌లో ఇన్‌స్టెంట్ ఫుడు తింటుంటారు. లేదా బయట ఉన్న ఫుడ్ తింటారు. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అందుకే ఇంట్లోనే ఈజీగా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని తయారు చేసుకుంటే.. ఆరోగ్యంతో పాటుగా టైమ్‌ కూడా సరిపోతుంది. అదేం ఫుడ్ అని అనుకుంటున్నారు. అదే సామలతో చేసిన కిచిడి. సామలు అంటే ఏమిటో చాలామంది తెలియదు. ఇది చిరు ధాన్యాలలో ఒకటి. వీటిని కనీసం వారికి రెండు లేదా మూడు సార్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూసేయండి.

సామలతో తయారు చేసిన కిచిడీని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. డయాబెటిస్ ఉన్న వారికి ఈ ఫుట్ ఎంతో మేలు చేస్తుంది. మాములుగా వెజిటేబుల్ రైస్ చేసుకున్నట్లు దీనిని తయారు చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వారికి మాత్రమే కాదు.. దీనిని ఎవ్వరైనా తినవచ్చు.

కావల్సిన పదార్థాలు:

సామలు, బంగాళా దుంపలు, క్యారెంట్, పచ్చిమిర్చి, నెయ్యి లేదా నూనె, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, బీన్స్, ఉప్పు, జీలకర్ర, పల్లీలు, కొద్దిగ నిమ్మరసం.

తయారీ విధానం:

దీనిని తయారు చేసుకోవాలంటే.. ముందుగా సామలను ఐదు లేదా ఆరుగంటల పాటు నానబెట్టాలి. ఆ తరువాత వీటిని కడిగి పక్కన పెట్టుకోవాలి. బంగాళ దుంపలు, బీన్స్‌‌‌‌‌‌‌‌ను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బంగాళ దుంపలు ఉడికిన తరువాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె లేదా నెయ్యిని వేసుకోవాలి. అది వేడిక్కిన తరువాత అందులో కొంచెం జీలకర్ర, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, క్యారెట్, ఇలా ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాలి. ఆ తర్వాత బంగాళా దుంప ముక్కలు, ఉప్పు వేసి బాగా కలుపుకుని చిన్న మంట మీద కొంచెం సేపు వేయించుకోవాలి. నానబెట్టిన సామలను ఈ మిశ్రమంలో వేసి, రెండు కప్పుల నీటిని పోసి, బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో కొత్తిమీర, కొంచెం నిమ్మరసం కలుపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే సామల కిచిడి రెడీ అయిపోయింది.

Next Story