- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు చేతులు లేవు, కానీ గొడ్డలితో చెక్క నరికాడు..అంతా షాక్! (వీడియో)
వీడియోపై భారతీయ సినీ నటుడు ఆర్ మాధవన్ కూడా స్పందించారు. Man with no arms chops wood with axe, video goes viral

దిశ, వెబ్‌డెస్క్ః విభిన్న ప్రతిభావంతులకు ఉండే ఆత్మ విశ్వాసం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. దేహంలో ఓ అంగం లోపించినా అది చేయాల్సిన పనిని మరో అవయవంతో మరింత శక్తివంతంగా చేయగల సామర్థ్యం వారి సొంతం. ప్రేరణ గలిగించే ఇలాంటి ఎన్నో వీడియోలు ఇంటర్నెట్‌లో చూస్తూనే ఉంటాం. అయితే, ప్రతి దానిలోనూ ఒక్కో ప్రత్యేకత కనిపిస్తుంది. సంకల్పం ఉంటే, దేన్నైనా సాధించగలమనడానికి ఇది గొప్ప ఉదాహరణగా కనిపిస్తుంది. ప్రస్తుత వీడియోలో రెండు చేతులూ లేని ఓ వ్యక్తి చెక్క దుంగలను నరకడానికి తన మెడను ఉపయోగించడం స్ఫూర్తివంతంగా ఉంటుంది. అతని ఛాతీ, గడ్డం మధ్య గొడ్డలి ఉంచి బలంగా చెక్కను ముక్కలు చేస్తాడు. ఈ వీడియో విపరీతమైన మంచు ఉన్న ప్రాంతానికి సంబంధించిందిగా కనిపిస్తుంది.
పీటర్ ష్నీడర్ అనే ఇతడు 12 సంవత్సరాల వయస్సులో విద్యుత్ షాక్‌కు గురై తన రెండు చేతులను కోల్పోయాడు. అయినా, స్వతంత్ర జీవితాన్ని గడపాలనుకొని అతని సామర్థ్యాన్ని పెంపొందించుకున్నాడు. ఇక, పీటర్ చెక్క దుంగలను నరికే వీడియోపై భారతీయ సినీ నటుడు ఆర్ మాధవన్ కూడా స్పందించారు. అలాగే, పీటర్ వీడియోపై స్పందించిన నెటిజన్లు అతని స్ఫూర్తివంతమైన చర్యను ప్రశంసించారు.






