- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్‌స్టాగ్రామ్‌లో మరో అప్డేట్.. ఇక లైకులు, కామెంట్లు పనికిరావు!!

దిశ, ఫీచర్స్ : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మరో షాకింగ్ న్యూస్.. ఇంతకాలం ఇందులోని రీల్స్‌కు ఎన్ని ఎక్కువ లైకులొస్తే అంత రీచ్ అయ్యేవి. ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తే అంత పాపులర్ అయ్యేవి. కానీ ఇక నుంచి అది జరగదు. ఎందుకంటే ఈ యాప్ ఇన్‌సైట్స్‌లో ‘What impacts your views’ అనే పేరుతో మెట్రిక్ ర్యాకింగ్ చూపించే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో ఇకపై మీ రీల్స్ లేదా కంటెంట్ రీచ్‌ను డిసైడ్ చేసేది లైక్స్, కామెంట్స్ కానేకాదు. స్కిప్ రేట్(Skip Rate), వాచింగ్ టైమ్ & షేర్ రేట్స్ (share rates) మాత్రమే ప్రధానం. న్యూ అప్‌డేట్ ప్రకారం మొదటి 3 సెకన్లలో ఎంతమంది స్క్రోల్ చేస్తున్నారో అనేదే ఇప్పుడు ముఖ్యమైన ఫ్యాక్టర్. ఇక్కడ రీల్ చూసే సమయం తగ్గి స్కిప్ రేట్ ఎక్కువైతే రీల్ రీచ్ కూడా బాగా తగ్గుతుంది. అంటే మీ కంటెంట్ వాచ్‌టైమ్, రీప్లేలు, షేర్స్ వంటివి ఎక్కువగా ఉంటే మాత్రమే అల్గారితం మీ రీల్‌ను ఎక్కువమందికి చూపిస్తుంది. ఇలాంటి కంటెంట్ మాత్రమే ప్రమోట్ అవుతుంది.






