ఈ మొక్కతో పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెంచుకోండి..!

by Disha Web Desk 9 |
ఈ మొక్కతో పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెంచుకోండి..!
X

దిశ, వెబ్‌డెస్క్: వివిధ రంగుల్లో ఆకర్షనీయమైన పూలను కలిగి ఉండే ముళ్ల గోరింట గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. మన ఇంటి దగ్గర పెరట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే మొక్కల్లో ఇది ఒకటి. ఈ మొక్క పువ్వుల రంగు.. ఎరుపు, పసుపు, తెలుపు, నీలం రంగులో ఉంటుంది. ఇది చిన్న చిన్న ముళ్లులతో, గుబురుగా 2 నుంచి 4 అడుగుల ఎత్తులో పెరుగుతుంది. అందరికి ఈ మొక్కను కేవలం అలంకరణ కోసమే ఉపయోగిస్తారని తెలుసు. కానీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ముళ్ల గోరింట ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..

* ఎన్నో ఔషధ గుణాలతో కూడుకున్న ముళ్ల గోరింట ఆకులను పేస్ట్‌లా చేసి, పాదాలకు అప్లై చేయడం వల్ల పాదాల పగుళ్లు సులభంగా తగ్గుతాయి.

* అలాగే ఆ పేస్ట్‌లో ఉప్పు యాడ్ చేసి దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. దీంతో మీ పళ్లు తెల్లగా మెరిసిపోతాయి.

* దంత చిగుళ్ల నుంచి రక్తం కారడం సమస్య ఉన్నవారికి ఈ మొక్కతో ఈజీగా నయం అవుతుంది.

* ముళ్ల గోరింట ఆకులతో డికాషన్ చేసుకుని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోటిపూతతో పాటు దర్వాసన కూడా దూరం అవుతుంది.

* ఈ ఆకుల పేస్ట్‌ను తామర, దురద, నొప్పులు వంటి చర్మ సమస్యలు ఉన్న చోట లేపనంగా రాయడం వల్ల తొందరగా తగ్గుతాయి.

* అలాగే ముళ్ల గోరింట మొక్కను ఉపయోగించడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది.

* శరీరంలో చాలా ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్ కూడా తొలగిపోతుంది.

Also Read... ఇంట్లో కుక్క, ఆవు తుమ్మితే మనుషులకు శుభమా.. హానికరమా..?

18 ఏళ్ల అబ్బాయిలు, అమ్మాయిలు చేయకూడని తప్పులు ఇవే..!


Next Story