- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనుషులే గొర్రెలైతే.. అక్కడ ఈ పోటీ ఫేమస్! (వీడియో)
గొర్రె వేషంలో ఉన్నవారు మాత్రం గొర్రెల్లా ప్రవర్తించాల్సిందే. People Dress As Sheep & Make 'Baa Baa' Sounds.

దిశ, వెబ్‌డెస్క్ః మనుషులంతా నివశించేది భూమిపైన అయినా ఆయా ప్రాంతాలు, అక్కడున్న వాతావరణ పరిస్థితులను బట్టి అనేక దేశాల్లో అనేకానేక సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్నాయి. ఆయా ఆచారాలు అక్కడే స్థానికంగా రూపుదిద్దుకొని, ఎన్నో ఏళ్లుగా ఆచరణలో ఉన్నాయి. ఇలాంటి ఒక ఒక విచిత్రమైన సాంప్రదాయాన్ని తెలియజేసే వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇందులో మనుషులు గొర్రెల్లా దుస్తులు ధరించి, అచ్చం గొర్రెల్లానే ప్రవర్తించాలి. చుట్టూ చూస్తున్నవారు ఎంత సరదాగా మాట్లాడినప్పటికీ, గొర్రె వేషంలో ఉన్నవారు మాత్రం గొర్రెల్లా ప్రవర్తించాల్సిందే. ఇలాంటి విచిత్రమైన పోటీని హైలైట్ చేస్తూ ఈ వీడియో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వీడియోలో గొర్రెల వేషధారణలో చాలా మంది వ్యక్తులు గొర్రెల కంచెలో తిరుగుతూ బా.. బా.. శబ్దాలు చేస్తుంటారు. అయితే, ఇది ఒక ప్రదర్శనా బృందం చేసిన వీధి నాటక ప్రదర్శన అని చాలా మంది నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. మీరూ చూడండి!






