- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బులు కోసం అక్క పెళ్లిలో అందరిముందు బావతో ఇలా..?! (వీడియో)
"గొప్ప ఆలోచన" అంటూ మెచ్చుకుంటున్నారు. In A Wedding Sisters-in-Law Play Spin The Wheel Game With Groom to Demand Money.

దిశ, వెబ్‌డెస్క్ః ఇండియాలో పెళ్లంటే నూరెళ్ల పంటే కాదు.. విపరీతమైన వినోదం, హాస్యం, డ్రామా వంటివి అన్నీ కలిసి లైఫ్ టైం జ్ఞాపకంగా నిలిచిపోయే ఒక సందర్భం. పెళ్లిలో కొన్ని ఆచారాల దగ్గర బావ మరదళ్ల జోరు, హుషారు భలే సరదాగా ఉంటుంది. ఇక, ఈ సోషల్ మీడియా కాలంలో పెళ్లి వీడియోల క్రేజ్ చెప్పనవసరం లేదు. ఈ క్రమంలోనే జిజా-సాలీకి సంబంధించిన ఓ సరదా క్లిప్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. మనందరికీ తెలిసినట్లుగా, పెళ్లి కొడుకైన బావను ఆటపట్టించే సరదా ఆచారాలు పెళ్లిలో చాలా ఉంటాయి. వాటిల్లో 'జూతా చుపాయ్ (చెప్పులు దొంగిలించి, దాచిపెట్టడం)' ఒకటి. ఈ ఆచార సమయంలో మరదళ్లు బావ జోళ్లు తిరిగి ఇవ్వడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. ఇదే తంతును సరదాగా చేస్తున్న ఓ వీడియో ఇంటర్నెట్‌లో మోత మోగుతుంది. ఇందులో స్పెషల్ ఏంటంటే, బావ బూట్లు తిరిగి ఇవ్వడానికి మరదలు అద్భుతమైన ఐడియా వేసింది. అమ్మాయిలంతా కలిసి ఒక స్పిన్ వీల్‌ను సిద్ధం చేశారు. ఇందులో ప్రతి గుర్తుపై కొంత మొత్తం రాసి ఉంటుంది. బావ చక్రం తిప్పిన తర్వాత అది ఎక్కడ ఆగుతుందో అక్కడున్నంత డబ్బులు ఇవ్వాలి. చివరకు అది రూ.90,000 వద్ద ఆగిపోవడం సరదాకే షాకిచ్చినట్లయ్యింది! ఈ వీడియోను వెడ్ అబౌట్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేయగా, నెటిజన్లు, ప్రత్యేకంగా ఇలాంటి మరదళ్లు, ఈ కాన్సెప్ట్‌ను ఇష్టపడ్డారు. "గొప్ప ఆలోచన," అంటూ మెచ్చుకుంటున్నారు.






