- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇతరుల మెప్పు కోసం ఆరాటం.. సొంత అవసరాలపై నిర్లక్ష్యం.. చివరికి జరిగేది ఇదే..!
ఇతరుల మెప్పు కోసం ఆరాటం.. సొంత అవసరాలపై నిర్లక్ష్యం.. చివరికి జరిగేది ఇదే..!

దిశ, ఫీచర్స్ : సొంత పనులు పక్కన పెట్టైనా సరే.. ఇతరుల పనులు చక చకా చేసి పెట్టేస్తుంటారు కొందరు. తమకు, తమ ఇంట్లో వారికి అనారోగ్యం చేసినా పెద్దగా పట్టించుకోరు కానీ.. తమకు తెలిసిన బయటి వ్యక్తులకు ఏదైనా జరిగితే మాత్రం తట్టుకోలేనంత పనిచేస్తారు. ముందుండి పనులు చక్కబెట్టడం, హాస్పిటల్‌కు తీసుకెళ్లడం, అవసరమైన సహాయం అందించడం చేస్తుంటారు. ఇలా ఏదో ఒకటి రెండు పనుల్లో కాదు, చాలా విషయాల్లో ఇలాగే ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వారినే సైకాలజిస్టులు పీపుల్ ప్లీజర్స్ (People Pleasers) అంటున్నారు. అయితే ఈ బిహేవియర్ చివరికి సదరు వ్యక్తులకు నష్టం చేస్తుందని చెబుతున్నారు.
ఇతరుల అవసరాలను.. సొంత అవసరాలకంటే ఎక్కువగా భావించే వ్యక్తులు, తరచుగా తమను తాము విస్మరించుకుంటారు. ఇతరులకోసం త్యాగం చేస్తుంటారు. వీరు తమ స్వీయ-విలువను ఇతరుల ఆమోదం లేదా మెప్పుతో ముడిపెట్టడం వల్ల ఈ ప్రవర్తనకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చివరికి సదరు వ్యక్తుల్లో ఇది దీర్ఘకాలిక ఒంటరితనానికి(Chronic loneliness), డిప్రెషన్‌కు దారితీస్తుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ‘జర్నల్ ఆఫ్ సోషల్ అండ్ పర్సనల్ రిలేషన్‌షిప్స్’లోని ఒక అధ్యయనం కూడా సంబంధాలలో అతిగా త్యాగం చేయడం జీవిత సంతృప్తిని తగ్గించి, లోన్లీనెస్ భావనలను పెంచుతుంది.
ఇతరులను సంతోషపెట్టడానికి నిరంతరం ప్రయత్నించడం వల్ల, పీపుల్ ప్లీజర్స్ తమ సొంత భావోద్వేగ అవసరాలను కూడా విస్మరిస్తారు. ఫైనల్లీ వీరు ఏమీతోచని ఒక విధమైన భావన (emptiness and)కు, విడిపోయిన(separation) భావనకు, భావోద్వేగ క్షీణతకు లోనవుతారు. ఇది నెరవేరని వ్యక్తిగత కోరికల చక్రాన్ని(cycle of personal desires) సృష్టిస్తుంది. అదనంగా ఆరోగ్యకరమైన సరిహద్దులను సెట్ చేసుకోవడంలో విఫలం అవుతుంటారు. కోపం, ఆందోళన, ఎమోషనల్ వీక్‌నెస్ వంటివి పెరిగిపోతాయి.
వ్యక్తిగత ఎదుగుదలకు నష్టం చేసే ‘పీపుల్ ప్లీజర్’ ప్రవర్తన నుంచి బయటపడాలంటే.. తమ అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చుకోవడంపై ఫోకస్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే నిజమైన సంబంధం పరస్పర గౌరవం, సమతుల్యతపై ఆధారపడుతుంది తప్ప వన్‌సైడ్ ప్రేమవల్లనో, వన్‌సైడ్ త్యాగం వల్లనో అది సాధ్యం కాదని చెబుతున్నారు. పైగా ఇతరులకు, సమాజానికి ఇబ్బంది కలిగించనిదైనప్పుడు, వ్యక్తిగత సంతోషానికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమాత్రం స్వార్థం కాదని, ఇది మానసిక శ్రేయస్సుకు దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.






