- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Technology : ఆ విధమైన నోటిఫికేన్లతో ఇబ్బందులా? మీ ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మారిస్తే చాలు..!
Technology : ఆ విధమైన నోటిఫికేన్లతో ఇబ్బందులా? మీ ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మారిస్తే చాలు..!

దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ వాడని వారంటూ ఎవరూ ఉండరు. ప్రతీ ఒక్కరి జీవితంలో అదో భాగమైపోయింది. వ్యక్తుల మధ్య మెరుగైన కమ్యూనికేషన్ కొనసాగించడంలో కీ రోల్ పోషిస్తోంది. అయితే ఫోన్లవాడకం సందర్భంగా మన అవసరాన్ని బట్టి కూడా కొన్ని సెట్టింగ్స్ చేసుకోవడం కంఫర్ట్‌గా ఉంటుంది. లేకపోతే చికాకు ఏర్పడటం, పనికి ఆటంకం కలగడం వంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు డీఎన్‌డీ మోడ్ యాక్టివేట్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ అదేమిటి? ఎలా చేసుకోవాలి? ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు వర్క్‌లో ఉన్నప్పుడో, ట్రాఫిక్‌లో వెహికల్ నడుపుతున్నప్పుడో, మీటింగ్‌లో ఉన్నప్పుడో, సీరియస్‌గా చదువుకుంటున్నప్పుడో తరచుగా ఫోన్ కాల్స్ వస్తుంటే ఎలా ఉంటుంది. డిస్టర్బ్ అవుతుంది. కదా కాల్స్ మాత్రమే కాదు, మెసేజ్‌లు, నోటిఫికేషన్లు, అలర్ట్‌లు, రింగ్ టోన్స్ వంటివి తరచుగా పనికి ఆటంకం కలిగిస్తుంటాయి. సాధారణ ఫోన్ వాడినా, స్మార్ట్ ఫోన్ వాడినా ఈ సమస్య ప్రతీ ఒక్కరు ఎదుర్కొంటుంటారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అంటే Do Not Disturb (DND) మోడ్ యాక్టివేట్ చేయాలంటున్నారు నిపుణులు. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఏ మొబైల్‌లో అయినా దీనిని ఈజీగా చేయవచ్చు.
డీఎన్‌డీ(DND) మోడ్ అంటే?
తరచుగా వచ్చే మెసేజ్‌లు, ఫోన్ కాల్స్, నోటిఫికేషన్లు, అలర్ట్‌లు మిమ్మల్ని ఆటంకం కలిగించకుండా ఉపయోగపడేదే ‘డూ నాట్ డిస్టర్బ్(Do Not Disturb) మోడ్. దీనిని ఆన్ చేసి పెడితే చాలు మీ ఫోన్‌కు వచ్చే కాల్స్, మెసేజెస్, నోటిఫికేషన్స్ మ్యూట్ అవుతాయి. దీనివల్ల మీరు డిస్టర్బ్ కాకుండా ఉంటారు. పనిలో ఉన్నప్పుడు ఏకాగ్రత దెబ్బతినకుండా ఉంటుంది. ఇందులో ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీకు కావాల్సిన నంబర్లను మినహాయించి, అవసరం లేని వాటికి సంబంధించి అలర్ట్‌లను మాత్రమే ఆఫ్ చేసే సౌలభ్యం కూడా ఉందంటున్నారు నిపుణులు.
ఆండ్రాయిడ్‌లో ఇలా..
మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ‘డు నాట్ డిస్టర్బ్’ మోడ్‌ను యాక్టివేట్ చేయడానికి ముందుగా ఫోన్ సెట్టింగ్స్ ఆన్ చేయాలి. ఆ తర్వాత ‘సైండ్ అండ్ వైబ్రేషన్’ లేదా నోటిఫికేషన్ ఆప్షన్‌పైన క్లిక్ చేసి అక్కడ కనిపించే ‘Do not disturb’ ఎనేబుల్ చేస్తే చాలు. ఎలాంటి నోటిఫికేషన్లు, రింగ్ టోన్ సౌండ్లు రావు. అవసరం అనుకుంటే ఇక్కడ టైమ్ షెడ్యూల్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకు నోటిఫికేషన్లు, మెసేజ్‌లు వంటివి రాకూడదో ఆ సమయాన్ని ఎంటర్ చేసి కూడా సెట్ చేసుకోవచ్చు. కాల్స్‌కు సంబంధించి కూడా ఏ నంబర్ నుంచి కాల్ రాకూడదనుకుంటే ఆ నంబర్‌ను డీఎన్‌డీ మోడ్‌లోకి మార్చవచ్చు.
ఐఫోన్‌లో అయితే ఇలా..
ఇక ఐఫోన్ యూజర్లు డీఎన్‌డీ (Do not disturb) మోడ్ ఆన్ చేసుకోవడానికి ముందుగా సెట్టింగ్‌లోకి వెళ్లండి. తర్వాత ‘ఫోకస్’ మీద క్లిక్ చేస్తే, అక్కడి ‘డు నాట్ డిస్టర్బ్’ ఆప్షన్ కనిపిస్తుంది. ఎనేబుల్ చేస్తే చాలు. అట్లనే ‘అలో నోటిఫికేషన్స్’ లో కూడా మీరు ఎవరి నంబర్ల నుంచి మెసేజ్‌లు, నోటిఫికేషన్లు రాకూడదనుకుంటారో ఆ నంబర్లను మాత్రమే కూడా డీఎన్‌డీ మోడ్‌లోకి మార్చవచ్చు, టైమ్ షెడ్యూల్ కూడా సెట్ చేసుకోవచ్చు అంటున్నారు సాంకేతిక నిపుణులు. ఇంకెందుకాలస్యం, అవసరం అనుకుంటే ట్రై చేసి చూడండి!






