హైపర్-రియలిస్టిక్ AI ట్రెండ్.. రియల్ vs ఫేక్ అందాలు!!

by Javid Pasha |

సోషల్ మీడియా వేదికల్లో ‘హైపర్ రియలిస్టిక్ ఏఐ పోర్ట్రెయిట్‌’ ప్రొఫైల్ పిక్స్, రీల్స్ క్రమంగా పెరుగుతున్నాయి. యువత రియల్ లైఫ్‌కి భిన్నంగా క్రియేటివిటీని ప్రదర్శిస్తోంది.

హైపర్-రియలిస్టిక్ AI ట్రెండ్.. రియల్ vs ఫేక్ అందాలు!!
X

దిశ, ఫీచర్స్ : ఇన్‌స్టాలో అమ్మాయి ప్రొఫైల్ పిక్ చూసి ఎంత బాగుందో అనిపిస్తోందా? రీల్స్‌లో యువకుడి హెయిర్ స్టైల్ చూసి వావ్..! అనుకుంటున్నారా? జర జాగ్రత్త..! ఎందుకంటే.. రియల్ లైఫ్‌లో మీరు అనుకున్నంత సీన్ లేకపోవచ్చు. మీరనుకున్నట్టు ఆ అమ్మాయి అసలు అందంగా లేకపోవచ్చు. మీరనుకున్న ఆ యువకుడికి అసలు తలపై వెంట్రుకలు కూడా ఉండకపోవచ్చు. యెస్.. ప్రస్తుతం చాలా వరకు ఇదే జరుగుతోంది. దీనినే ‘హైపర్ - రియలిస్టిక్ ఏఐ పోర్ట్రెయిట్‌ ట్రెండ్’ అని పిలుస్తున్నారు. ఏఐ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియాలో దీని ప్రభావం క్రమంగా పెరుగుతోంది. అంటే ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్ లేదా ఇంకెవరైనా కావచ్చు.. ఆధునిక సాంకేతికతతో, ముఖ్యంగా ఏఐ టూల్స్‌తో తమ సహజమైన రూపానికి భిన్నమైన ఆకట్టుకునే, అందమైన రూపంగా క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేస్తారు. అంటే.. రీల్ లైఫ్‌కి రియల్ లైఫ్‌కి చాలా తేడా ఉంటుంది. అందుకే ఏదీ వెంటనే ఫిక్స్ అయి.. ఫీలై పోకండి అంటున్నారు నిపుణులు.

ఇటీవల సోషల్ మీడియా వేదికల్లో ‘హైపర్ రియలిస్టిక్ ఏఐ పోర్ట్రెయిట్‌’ ప్రొఫైల్ పిక్స్, రీల్స్ క్రమంగా పెరుగుతున్నాయి. యువతీ యువకులు లైక్స్ కోసం, ఫాలోవర్లను పెంచుకోవడం కోసం ఇలా చేస్తున్నారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి తమ రియల్ ఫొటోలను మరింత అందంగా క్రియేట్ చేస్తున్నారు. చాలామంది వీటిని నిజమైన ఫోటోలు అనుకునేలా కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వేదికల్లో ఈ ట్రెండ్ వైరల్ అవుతోంది. ఇక్కడ యూజర్లు తమ సెల్ఫీలు లేదా ఇతరుల ఫోటోలను అప్‌లోడ్ చేసి, హైపర్-రియల్ పోర్ట్రేట్స్ జెనరేట్ చేస్తున్నారు. దీనివల్ల గతంలో ఏఐ ఇమేజెస్‌లో కనిపించే అసహజమైన స్కిన్ టెక్స్చర్ (Unnatural skin texture), హెయిర్ లేదా ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పుడు పూర్తిగా తొలగిపోయి, నేచురల్ పోర్స్, ఫ్లష్డ్ టోన్స్ అండ్ ఫిల్మ్ గ్రెయిన్ లాంటి డీటెయిల్స్ యాడ్ అయి అందంగా కనిపిస్తున్నాయి. దీతో రియల్ అండ్ ఫేక్ మధ్య తేడా తెలియకుండా పోతోంది. ఈ ట్రెండ్ మిడ్‌జర్నీ, హిగ్స్‌ఫీల్డ్ సోల్ లాంటి టూల్స్‌తో ప్రసిద్ధి పాపులరై ఇప్పుడు ఇన్‌స్టా, ఫేస్‌బుక్, పలు ఇతర సోషల్ మీడియా వేదికలో చక్కర్లు కొడుతోంది. హైపర్ రియలిస్టిక్ ట్రెండ్‌కు మూల కారణాలు జెనరేటివ్ AI మోడల్స్ (లాంటి D-ID, GPT-4), అలాగే అడ్వాన్స్‌డ్ ఎల్ఎల్ఎమ్‌లు అని కూడా నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. ఇవి మనుషుల మాదిరి సంభాషణలను, విజువల్స్ క్రియేట్ చేయగలవు. అందుకే సోషల్ మీడియాలో వేదికల్లోని ప్రొఫైల్ పిక్స్‌ను, రీల్స్‌ను చూసి.. వారి నిజమైన రూపం కూడా లాగే ఉంటుందని మాత్రం ఫిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు నిపుణులు.

Next Story