చెరువులపై ఫోకస్.. ఓఆర్ఆర్ లోపల హైడ్రాకు బాధ్యతలు

by Daayi Srishailam |

చెరువుల పరిరక్షణపై హెచ్ఎండీఏ ఫోకస్ పెట్టింది.

చెరువులపై ఫోకస్.. ఓఆర్ఆర్ లోపల హైడ్రాకు బాధ్యతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : చెరువుల పరిరక్షణపై హెచ్ఎండీఏ ఫోకస్ పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్), త్రిపుల్ ఆర్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలతోపాటు చెరువుల పరిరక్షణకు హెచ్ఎండీఏ నడుంబిగించింది. ఓఆర్ఆర్ లోపలి చెరువుల పరిరక్షణ బాధ్యత హైడ్రాకు అప్పగించింది. వీటి అభివృద్ధికి హెచ్ఎండీఏ నిధులనే వినియోగిస్తున్నారు. త్రిపుల్ ఆర్ లోపల ఉన్న చెరువులను మాత్రమే హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

1,225చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్

హెచ్ఎండీఏ పరిధిలో 5వేలకుపైగానే చెరువులు ఉన్నాయి. హెచ్ఎండీఏ పరిధిని త్రిపుల్ ఆర్ వరకు విస్తరించడంతో వీటి సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అయితే లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 1,225చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించడంతోపాటు ఫైనల్ నోటిఫికేషన్ జారీచేశారు. 2,993 చెరువులకు ప్రైమరీ నోటిఫికేషన్ జారీచేశారు. ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసిన చెరువుల పరిరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

ఏడాది కాలంలో…

హెచ్ఎండీఏ పరిధిలో 14ఏండ్ల కాలంలో 2,525 చెరువులకు ప్రైమరీ నోటిఫికేషన్స్, 230 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ మాత్రమే జారీచేశారు. కానీ ఆగస్టు 2024 నుంచి జూన్ 2025 వరకు 408 చెరువులకు ప్రైమరీ నోటీఫికేషన్స్, 995 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్స్ జారీచేశారు.

Next Story