- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోజులో ఎంత సమయం వాకింగ్ చేస్తున్నారు? ఎక్స్ పర్ట్స్ ఏం చెప్తున్నారు?
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 10,000 అడుగులు నడవాలని చాలా మంది లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ, ఈ లక్ష్యం ప్రతి ఒక్కరికీ సరిపోదు. మీ వయస్సు, శారీరక స్థితి, రోజువారీ జీవన విధానం బట్టి నడక పరిమాణం మారుతుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 10,000 అడుగులు నడవాలని చాలా మంది లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ, ఈ లక్ష్యం ప్రతి ఒక్కరికీ సరిపోదు. మీ వయస్సు, శారీరక స్థితి, రోజువారీ జీవన విధానం బట్టి నడక పరిమాణం మారుతుంది. నిత్యం 8,000 నుంచి 10,000 అడుగులు నడిస్తే గుండె ఆరోగ్యం మెరుగుపడటం, డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గడం వంటి లాభాలు ఉన్నాయి. అయినప్పటికీ, శరీర సామర్థ్యాన్ని మించి నడవడం ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నడక సరైన పరిమితిలో ఉంటేనే మేలు జరుగుతుంది. కొత్తగా నడవడం మొదలుపెట్టిన వారు 30 నిమిషాల నడక తర్వాత కీళ్ల నొప్పులు లేదా అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. అలవాటైన వారు ఎక్కువ సమయం నడిచినా సమస్య ఉండకపోవచ్చు. అయితే.. శరీరం ఇచ్చే సంకేతాలను విస్మరిస్తూ అతిగా నడిస్తే క్రమంగా సమస్యలు తలెత్తుతాయి.
అధిక నడక వల్ల ఈ ఇబ్బందులు తలెత్తవచ్చు
కీళ్లపై ఒత్తిడి: గతంలో గాయమైన కీళ్లలో నొప్పి తిరిగి మొదలవుతుంది. ఎక్కువ నడక వల్ల కీళ్లు ఒత్తిడికి గురై, నష్టం జరగవచ్చు.
పాదాల సమస్యలు: తగని చెప్పులు లేదా అధిక నడక వల్ల పాదాలపై గడ్డలు, బొబ్బలు ఏర్పడి నడవడం కష్టతరం చేస్తాయి.
శారీరక అలసట: శరీరం బలహీనంగా అనిపించడం, సాధారణ పనులు చేసినా శ్వాస ఆడకపోవడం అతిగా నడవడం వల్ల కలుగుతుంది.
పాదాల వాపు: రోజంతా నడిచిన తర్వాత కాళ్లలో నొప్పి, వాపు రావడం సహజం. ఇది కాలక్రమంలో తీవ్ర సమస్యగా మారవచ్చు.
మానసిక ఒత్తిడి: నడక మనశ్శాంతిని ఇస్తుంది, కానీ అతిగా చేస్తే ఆందోళన, చిరాకు, నీరసం వంటివి పెరగవచ్చు.
వాకింగ్ లో ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి
నడక కొత్తగా ప్రారంభించేవారు మొదట రోజుకు 15 నిమిషాల నడకతో ఆరంభించి, క్రమంగా సమయాన్ని పెంచుకుని 30 నిమిషాల చురుకైన నడక లక్ష్యంగా సాగాలి.
నడుస్తున్నప్పుడు ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం శరీరానికి మంచిది.
వారంలో కనీసం మూడు రోజులు నడక సాధన చేయడం ద్వారా శరీరం ఫిట్‌గా ఉంటుంది.
నడక శరీరానికి ఎంతో మేలు చేసే అలవాటు అయినప్పటికీ, అతిగా చేయడం వల్ల శారీరక, మానసిక సమస్యలు తలెత్తవచ్చు. శరీరానికి తగిన విశ్రాంతి ఇస్తూ, సమతుల్యంగా నడకను కొనసాగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.






