sreeleela: నెట్టింట వైరలవుతోన్న టాలీవుడ్ కుర్ర హీరోయిన్ పోస్ట్

by Kodari Anjali |   (  Updated:2025-06-06 15:04:43  IST  )

కెరీర్ ప్రారంభంలోనే వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద దూసుకుపోయింది కుర్ర హీరోయిన్ శ్రీలీల.

sreeleela: నెట్టింట వైరలవుతోన్న టాలీవుడ్ కుర్ర హీరోయిన్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కెరీర్ ప్రారంభంలోనే వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద దూసుకుపోయింది కుర్ర హీరోయిన్ శ్రీలీల. ఈ బ్యూటీ మొదట్లో చిన్న చిన్న హీరోల సరసన నటించింది. వెంటనే ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన అవకాశం కొట్టేసింది. ఇక ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో వరుస అవకాశాలు దక్కాయి. ఈ అమ్మడు అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.

ముఖ్యంగా ఇరగదీసే డ్యాన్స్‌తో కుర్రాళ్లకు చెమటలు పట్టించిందనడంలో అతిశయోక్తిలేదు. కాగా శ్రీలీలను తమ సినిమాల్లో తీసుకోవడానికి దర్శకులు పోటీ పడ్డారు. టాలీవుడ్ మొదట్లోనే వరుస సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేసింది. సీనియర్ హీరోయిన్లకు సైతం చెమటలు పట్టించింది. ఇకపోతే శ్రీలీల తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులతో టచ్ లో ఉంటుందన్న విషయం తెలిసిందే.

తన వ్యక్తిగత, వృత్తిపర విషయాల్ని పంచుకుంటుంది. తాజాగా ఈ టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ సోషల్ మీడియా వేదిక అయిన తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో కుర్రాళ్లకు మత్తెక్కించే ఫొటోలు పంచుకుని.. ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది. ‘‘చాలా రోజుల తర్వాత’’ అని క్యాప్షన్ జోడించింది. శ్రీలీల పంచుకున్న హాట్ ఫొటోల్లో తన గాజులు మరింత హైలెట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ హీరోయిన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story