Personal life : పడక గదిలో అలా చేయడం లేదని కోప్పడుతున్నాడు మేడం..! నన్నేం చేయమంటారు?

by Javid Pasha |   (  Updated:2025-06-26 13:27:51  IST  )

Personal life : పడక గదిలో అలా చేయడం లేదని కోప్పడుతున్నాడు మేడం..! నన్నేం చేయమంటారు?

Personal life : పడక గదిలో అలా చేయడం లేదని కోప్పడుతున్నాడు మేడం..! నన్నేం చేయమంటారు?
X

దిశ, ఫీచర్స్ : గాలి, నీరు, ఆహారం లాగే దాంపత్య జీవితంలో శృంగారం(Sex) కూడా ఒక అవసరం. కారణాలేమైనా సెక్స్ అనేది లేకపోతే కాపురాలు సక్రమంగా సాగే అవకాశం తక్కువని పెద్దలు, నిపుణులు సైతం చెబుతుంటారు. ఈ కారణంతోనే ఇటీవల విడాకుల సంఖ్య కూడా పెరుగుతోంది. అందుకే భార్యా భర్తల మధ్య అన్యోన్య జీవితానికే కాదు, మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా శృంగారం అవసరం. అయితే ఈ విషయంలో సరైన అవగాహనలేకపోవడంతో కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి వారికి ప్రముఖ సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్, డాక్టర్ భారతి ఇస్తున్న సలహాలు, సూచనలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

డాక్టర్ గారూ.. నాకు కీళ్ల నొప్పుల సమస్య ఉంది. నొప్పితో మా వారికి సహకరించలేకపోతున్నాను. ఆయనలో అసంతృప్తి, కోపం ఎక్కువైపోతుంటే.. నాలో డిప్రెషన్ ఎక్కువైపోతున్నది. స్ట్రెస్ వలన నొప్పులింకా ఎక్కువ అవుతున్నాయి. మా దాంపత్య జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి ? - కాత్యాయని, వరంగల్

జవాబు : కీళ్లనొప్పి, వాపు వలన సులువుగా కదలలేకపోవడం, సెక్స్‌లో చురుకుగా పాల్గొనలేకపోవడం ఉంటుంది. మీ వారు మీ స్థితిని అర్థం చేసుకోవాలి. అదే సమస్య ఆయనకు వస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలి. మీరు నొప్పిలేని సమయంలోనే సెక్స్ లో పాల్గొనండి. రాత్రి 2 గంటల ముందుగా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకోవడం.. వేడి నీళ్ల కాపడం పెట్టుకోవడం చేయాలి. నొప్పి ఉన్న కీళ్ల పైన ఎక్కువ బరువు పడని భంగిమలు ఎన్నుకుంటే మంచిది. ఇలా చేస్తూ వారానికి రెండు సార్లు నొప్పి లేకుండా సెక్స్ లో పాల్గొనవచ్చు. మీ వారు మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని.. మీ పట్ల బాధ్యతతో వ్యవహరించాలి.

డాక్టర్ భారతి

సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్

ప్రీ & పోస్ట్ మేరేజ్ &

సెక్సువల్‌ కౌన్సెలింగ్

86885 19225

Next Story