Doctor's advice : మూడేండ్లకే మూడ్ లేదంటే ఏం చేయాలి..?!

by Javid Pasha |   (  Updated:2026-01-16 11:47:15  IST  )

సెక్స్‌లో భాగస్వామికి నచ్చని, అసహ్యం కలిగించే అసహజ ధోరణులు పాటించడం, వేధించడం, అవమానించడం వంటి పనులు శృంగారం పట్ల ఆసక్తిని తగ్గిస్తాయి.

Doctors advice : మూడేండ్లకే మూడ్ లేదంటే ఏం చేయాలి..?!
X

ప్రశ్న: మేడం.. నా వయసు 30 ఏళ్లు. పెళ్లయి మూడేళ్లు అయింది. ఒక పాప. సెక్స్ లో పాల్గొనేటప్పుడు నా భార్య మూడు రావడంలేదని అంటుంది. తను చాలా బలహీనంగా ఉంటుంది. ఎప్పుడు మూడీగా ఉంటుంది. ఆహారం కూడా సరిగా తీసుకోదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆమెనెలా మార్చుకోవాలి ? - పి.ఎన్.ఆర్, కాకినాడ

జవాబు : నీ భార్య మానసికస్థితిని ఫ్రిజిడిటీ అంటారు. అంటే శృంగారంపై ఆసక్తి లేకపోవడం. దీనికి చాలా కారణాలు ఉంటాయి. 1) సెక్స్‌లో పాల్గొంటున్నప్పుడు ఆమెకు ఏదైనా నొప్పి అనిపించడ, పొత్తికడుపులో నొప్పి అంతర్ బాహ్య జననాంగాలకు ఏమైనా ఇన్ఫెక్షన్ కావడం వల్ల సెక్స్ తర్వాత నొప్పి వంటివి కలుగుతున్నాయేమో చూడాలి. మూత్రాశయ ఇన్ఫెక్షన్స్ కూడా ఏమన్నా ఉన్నాయా చూడాలి. ఇవన్నీ శారీరక కారణాలు. ఇవి తగ్గడానికి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకోవాలి. 2)ఇక రెండోది మానసిక కారణాల్లో చూడాలి. శృంగారంలో ఆమెకు ఇష్టం రాకుండా ఉండేలా మీ ప్రవర్తన ఉందేమో చూసుకోండి. సెక్స్ లో ఆమెకి అసహ్యం కలిగించే అసహజ ధోరణులు ఏమైనా పాటిస్తూ ఉన్నారా ? అలాగే ఆమెతో ప్రేమగా లేకపోవడం, మానసికంగా, శారీరకంగా మీరు ఆమెను వేధించడం.. ఆమెను అవమానించడం వంటి పనులు చేస్తున్నారేమో సరిచేసుకోండి. అత్తింటిలో తన ఇబ్బందులను పట్టించుకోని భర్త వల్ల కూడా స్త్రీలు అతని స్పర్శకు స్పందించరు. దీనివల్ల భర్త మీద ప్రేమ పోయి సెక్స్ పై అనాసక్తి ఏర్పడి, పూర్తిగా మనో శారీరక స్పందనలులేని స్థితికి చేరుకుంటారు.

హింసించే భర్తపైన భార్యకు కోరిక కలగదు. కాబట్టి ప్రేమ చాలా ముఖ్యం. భర్త ఇచ్చే గౌరవం.. ప్రేమతో కూడిన స్పర్శకే స్త్రీలు స్పందిస్తారు. మీలో ఇలాంటి లోపాలు ఉంటే పోగొట్టుకొని మీ భార్యకు దగ్గరకండి. అలాగే కలయిక ముందు 20 - 30 నిమిషాలు ఫోర్ ప్లే చేయండి. ఆమెకు ఒకసారి భావప్రాప్తి వచ్చాకే సంయోగంలో పాల్గొనండి. అన్నిటికంటే ముందు ఆమెకు అనాసక్తి ఎందుకు వచ్చిందో కనుక్కోండి. ఆ కారణాలకు తగినట్టుగా పరిస్థితులను మార్చండి. అప్పటికీ సమస్య అలాగే ఉంటే సెక్సాలజిస్ట్‌కి చూపించండి. అలాగే గర్భధారణ, పిల్లల పెంపకం, ఇంటి పని ఎక్కువగా ఉండి అలసిపోవడం కూడా సెక్స్‌లో ఆసక్తి పోవడానికి కారణాలుగా ఉంటాయి. అలాగే మళ్ళీ గర్భం వస్తుందేమో అన్న భయం కూడా మరో కారణంగా పనిచేస్తుంది. ఇవన్నీ గమనించి మీరు మీ లోపాలను కూడా సరిచేసుకొని మారండి. ఆమెకు కూడా కౌన్సిలింగ్, చికిత్స ఇప్పించండి.

- డాక్టర్ భారతి

సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్

ప్రీ & పోస్ట్ మేరేజ్ &

సెక్సువల్‌ కౌన్సెలింగ్

86885 19225

Next Story