మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడుతున్నారా..? ఇలా తెలుసుకోవచ్చు సింపుల్‌గా..!

by Javid Pasha |   (  Updated:2026-02-11 13:19:39  IST  )

ఎవరైనా మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతుంటే లేదా రహస్యంగా ప్రేమిస్తుంటే వారు మీతో చెప్పకపోయినప్పటికీ.. కొన్ని సైకలాజికల్ సంకేతాల ఆధారంగా గుర్తించవచ్చు అంటారు నిపుణులు.

మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడుతున్నారా..? ఇలా తెలుసుకోవచ్చు సింపుల్‌గా..!
X

దిశ, ఫీచర్స్ : ఏడాది మొత్తంలో ఫిబ్రవరి నెలకో స్పెషాలిటీ ఉంది. అదే.. వాలెంటైన్స్ వీక్. ముఖ్యంగా యువత తమకు ఇష్టమైన వ్యక్తులకు లవ్ ప్రపోజ్ చేయడానికి, అప్పటికే ప్రేమలో ఉన్నవారు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ సందర్భాన్ని ఒక అవకాశంగా భావిస్తారు. ఇక ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డేను ప్రత్యేకంగా పరిగణిస్తారు చాలామంది. మొత్తానికి ప్రేమ, ఆకర్షణల చుట్టూ తిరిగే ప్రేమికుల దినోత్సవం నేపథ్యంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఇష్టపడుతున్నారని తెలిపే సంకేతాలేవి? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

ఎవరైనా మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతుంటే లేదా రహస్యంగా ప్రేమిస్తుంటే వారు మీతో చెప్పకపోయినప్పటికీ.. కొన్ని సైకలాజికల్ సంకేతాల ఆధారంగా గుర్తించవచ్చు అంటారు నిపుణులు. అయితే కచ్చితంగా ఇవి మాత్రమే ప్రేమ సంకేతాలు అని చెప్పడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలైతే లేవు. కానీ మానసిక నిపుణుల ప్రకారం కొన్ని హవ భావాలను, ప్రవర్తను బట్టి ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నారో లేదో అర్థం చేసుకోవచ్చు.

కళ్లల్లో కనిపిస్తుంది!

ఒక వ్యక్తి మిమ్మల్ని బాగా ఇష్టపడుతుంటే లేదా మీ పట్ల అట్రాక్ట్ అయితే గనుక ఆ వ్యక్తిలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మీతో మాట్లాడుతున్నప్పడు ఆమె లేదా అతని కళ్లు సహజంగానే వ్యాకోచిస్తాయి. వాస్తవానికి ఇది నాడీ వ్యవస్థ ద్వారా నియంత్రించబడే అసంకల్పిత ప్రతిస్పందన. అత్యంత ఆసక్తి, ఉద్రేకానికి సంకేతం. కాబట్టి.. ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు అసంకల్పితంగా కళ్లను ఎక్కవసార్లు కదపడం, పెద్దవిగా చేసి మీ వైపు చూడటం, కనురెప్పలు తరచుగా కొట్టుకోవడం వంటి సంకేతాలు కనిపిస్తే వారు మీ పట్ల ఆసక్తితో ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.

మిమ్మల్ని ఫాలో అవుతారు

అనుకరించడం లేదా మిర్రరింగ్ అనేది మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తిలో కనిపించే మరో లక్షణం. ఒక విధంగా ఇష్టమైన వ్యక్తులపట్ల చూపించే సబ్ కాన్సియస్ వే. మీ పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికలు లేదా మాటతీరు లేదా పలు ఇతర విషయాల్లో మిమ్మల్ని అనుకరించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఒక వ్యక్తి తరచూ మీ వ్యవహారశైలిని కాపీ చేస్తున్నట్లు అనిపిస్తుందో లేదో గమనించండి. ఎందుకంటే వారు మీపట్ల ఆకర్షితులయ్యారనడానికి ఇదొక సంకేతం కావచ్చు.

జుట్టును సవరించుకోవడం..

మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి మీ దగ్గరగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తి మీకు బెస్ట్ లుకింగ్‌లో కనిపించాలని ఆరాటపడతారు. మీరు గమనించినప్పుడల్లా అనుకోకుండా తమ క్లాతింగ్‌ను సరిచేసుకోవడం, జుట్టును సరిచేయడం వంటివి చేస్తారు. అంతేకాకుండా మీకు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా వివిధ భంగిమల్లో నుల్చోవడం, కూర్చోవడం, మీరు దగ్గరగా ఉన్నప్పుడు సాధారణం కంటే ఎక్కువసార్లు తమను తాము చూసుకోవడం చేస్తుంటారు. ఇదంతా మిమ్మల్ని ఆకట్టుకోవడంలో ఒక భాగం.

ఫిజికల్ టచ్ కోసం ఆరాటం..

ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులయ్యే వ్యక్తులు తరచుగా యాదృచ్ఛిక ఫిజికల్ కాంటాక్ట్స్‌‌ను ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు. మీకు ఏదైనా వస్తువు ఇవ్వాలనుకున్నప్పుడు మీ చేతిని కావాలని తాకడం, మరీ దగ్గరగా వచ్చి మాట్లాడటం వంటివి చేస్తుంటారు. అసాధారణంకంటే ఎక్కువగా మిమ్మల్ని తాకడానికి ట్రై చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు టచింగ్ అనేది ఇష్టపడకపోయినా సహజంగా ఉండవచ్చు. కాబట్టి ప్రతి టచింగ్ ప్రేమ, ఆకర్షణ అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సందర్భం, సాంస్కృతిక నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.

ఎక్కువ శ్రద్ధ, ఎక్కువ ఆసక్తి

మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి ఇతరుల కంటే కూడా మీ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీరు చెప్పే విషయాలను ఆసక్తిగా వినడం, గుర్తుంచుకోవడం చేస్తుంటారు. ఏదైనా చెప్పినప్పుడు మరింత ఆసక్తిగా ప్రశ్నలు అడుగుతుంటారు. ఎందుకంటే వారు మిమ్మల్ని బాగా తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. అలాగే మిమ్మ్నలి ఇష్టపడే వ్యక్తి మీతో ఎక్కువసేపు ఉండాలని ట్రై చేస్తుంటారు. మీతో సమయం గడపడానికి సాకులు వెతుకుతుంటారు. బ్రీఫ్ ఇంటరాక్షన్ కోసం కూడా గంటలకొద్దీ కేటాయిస్తారు. అలాగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తమతో రావాలని కోరుతుంటారు.

మాటల్లో తడబాటు..

ఒక వ్యక్తి మిమ్మల్ని సాధారణంకంటే ఎక్కువగా ఇష్టపడుతున్నట్లయితే లేదా ప్రేమిస్తున్నట్లయితే ఆ విషయం మీతో ఎప్పుడూ చెప్పి ఉండరు. ఇలాంటివారు మీతో మాట్లాడుతున్నప్పుడు కుదురుగా ఉండలేరు. పైగా మీతో మాట్లాడే సందర్భంలో వారి మాటలు తడబడుతుంటాయి. ఏదో ఆందోళన కనిపించవచ్చు. గొంతు తడి ఆరినట్లు అనిపించవచ్చు. దీనిని బట్టి ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రత్యేకంగా భావిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. అలాగని ఇలాంటి సందర్భాలన్నీ ప్రేమ సంకేతాలే కాకపోవచ్చు. కొందరిలో బిడియం, ఆందోళన కూడా ఇందుకు కారణం అవుతుంటాయి.

ఫీట్ డైరెక్షన్, ఐ కాంటాక్ట్

ఒక వ్యక్తి బాడీ లాంగ్వేజ్‌ కూడా వారి గురించి చాలా చెబుతుంది. కాబట్టి మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వారి పాదాల డైరెక్షన్‌పై శ్రద్ధ వహించండి. వారి పాదాలు ఎక్కువగా మీ వైపు చూపడం, నడుస్తున్నప్పుడు, వివిధ సందర్భాలను బట్టి వారి పాదాలు మీ పాదాలకు టచ్ అయ్యేలా చేయడం వంటివి చేస్తుంటే మీ పట్ల ఆసక్తి కలిగి ఉన్నారనడానికి అర్థం. అలాగే ఒక వ్యక్తి సాధారణంకంటే ఎక్కువగా మీవైపే చూడటం, మిమ్మల్నే అబ్జర్వ్ చేయడం, మీ కళ్లవైపు గమనిస్తూ మాట్లాడటం కూడా ఆసక్తి కలిగి ఉన్నారనడానికి సంకేతం.

Next Story