రోజుకు రెండుసార్లైనా నాకు సెక్స్ కావాలి.. కానీ ఆమె ఒప్పుకోవట్లేదు..!

by Javid Pasha |   (  Updated:2025-07-18 12:50:33  IST  )

రోజుకు రెండుసార్లైనా నాకు సెక్స్ కావాలి.. కానీ ఆమె ఒప్పుకోవట్లేదు..!

రోజుకు రెండుసార్లైనా నాకు సెక్స్ కావాలి.. కానీ ఆమె ఒప్పుకోవట్లేదు..!
X

దిశ, ఫీచర్స్ : దాంపత్య జీవితంలో శృంగారం ఒక ముఖ్యమైన భాగం. భార్యా భర్తలు సంతోషంగా ఉండాలంటే.. లైంగిక విషయాలపట్ల అవగాహన అవసరం. లేకపోతే అపార్థాలకు, సంసార జీవితంలో సమస్యలకు దారితీయవచ్చు అంటున్నారు ప్రముఖ వైద్య నిపుణులు, సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్ డాక్టర్ భారతి. లైంగిక విషయాలపట్ల పాఠకులు అడిగిన పలు సందేహాలకు వారు చెప్పిన సమాధానాలేమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రశ్న: మేడం.. నాకు 36.. నా భార్యకు 32 సంవత్సరాలు. మాకు పెళ్లి అయ్యి ఆరేళ్లవుతోంది. ఒక పాప. పెళ్లయిన మూడు సంవత్సరాలు మంచి శృంగార జీవితం గడిపాం. కానీ గత మూడేళ్ల నుంచి నా భార్య సెక్స్‌లో ఆసక్తి చూపటం లేదు. నాకు రోజుకు రెండుసార్లైనా శృంగారంలో పాల్గొనాలని ఉంటుంది. కానీ ఆమె అలసిపోయి వద్దంటుంది. నా భార్యని మార్చుకునేది ఎలా ? - ఎస్కే, సూర్యాపేట

జవాబు : సెక్స్‌లో ఇష్టాయిష్టాలు స్త్రీ, పురుషులకి వేర్వేరుగా ఉంటాయి. మీకు కోరికలు అధికమై.. ఆమె నుంచి సెక్స్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. ఎంత అంటే ఆమె భరించలేనంత. నెలలో పీరియడ్స్ ముందరి సమయంలోహార్మోనల్ అసమతుల్యత వలన..స్త్రీలకి మనో శారీరక బాధలు ఉంటాయి. రొమ్ముల్లో నొప్పి వాపు ఉంటుంది. పొత్తి కడుపు నొప్పి, మైగ్రేన్ తలనొప్పి ఉంటాయి. డిప్రెషన్ ఉంటుంది. ఇవన్నీ మీకు అర్థం కావు. శృంగారంలో ఇరువురి ఆమోదం ఉండాలి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ కోరిక తీర్చే లైంగిక యంత్రం కాదు భార్య అంటే. ఇద్దరికీ అంగీకారయోగ్యంగా ఉండేటట్టు శృంగారానికి రోజులో ఒక సమయం కేటాయించండి. ఆమె బాధ పట్ల శ్రద్ధ, ఆమె మనో శారీరక సమస్యలపై అవగాహన, సహనుభూతి మీ శృంగార జీవితానికి మంచి పునాదులు వేస్తాయి. సెక్స్ కోసం ఆమెను వేధించక ఆమె కష్టాన్ని తెలుసుకోండి.

మేడం.. నా వయసు 19. నాకు తొమ్మిదేండ్ల వయసు నుంచి పెదనాన్న కొడుకు( నాకంటే పదేండ్లు పెద్ద) నాతో సెక్స్ చేయడం మొదలుపెట్టాడు. ఎవరికైనా చెబితే అమ్మానాన్నలను చంపేస్తాను అని భయపెట్టాడు. అలా బాల్యమంతా భయాందోళనలతో గడిపాను. అతను పైచదువులకు వేరే రాష్ట్రం వెళ్లిపోయాడు. ఇప్పుడు వచ్చి మళ్లీ తనతో సెక్స్‌లో పాల్గొనాలని వేధిస్తున్నాడు. నన్ను ఏం చేయమంటారు? - పి.బి.టి, కరీంనగర్

జవాబు : నువ్వు అతన్ని మళ్లీ భరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు పిల్లాడివి కాదు కదా. యువకుడువి.. ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పు లేదా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయు. సిగ్గుపడొద్దు.. అతనికి లొంగద్దు. హోమో సెక్స్ ఎక్కువ మంది పార్టనర్స్ తో జరిగితే లైంగిక వ్యాధులు వస్తాయి. ఇది ఏ రకంగా ఆరోగ్యవంతమైన లైంగిక జీవితంలోకి రాదు. ఈసారి కూడా భయపడి లొంగిపోతే.. చిన్నప్పుడు అనుభవించిన మెంటల్ ట్రామా మళ్లీ మొదలవుతుంది . నీ శృంగార జీవితం దెబ్బతింటుంది. ఖచ్చితంగా కఠినంగా తిరస్కరించడం నేర్చుకో.

- డాక్టర్ భారతి

సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్

ప్రీ & పోస్ట్ మేరేజ్ &

సెక్సువల్‌ కౌన్సెలింగ్

86885 19225

Next Story