శృంగార సమస్యకు కౌన్సెలింగ్..! ఇంతకీ అక్కడ ఏం చెప్తారు?

by Javid Pasha |   (  Updated:2026-01-02 11:32:38  IST  )

శృంగార సమస్యలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ మొదటి సెషన్‌లో థెరపిస్టు మీ సమస్యల గురించి తెలుసుకుంటారు దాంపత్య, వ్యక్తిగత, కుటుంబ, భావోద్వేగ, కమ్యూనికేషన్ అంశాలను ఆరా తీస్తారు.

శృంగార సమస్యకు కౌన్సెలింగ్..! ఇంతకీ అక్కడ ఏం చెప్తారు?
X

ప్రశ్న : డాక్టర్ గారూ.. మా దంపతులకు సెక్స్ సమస్య వచ్చింది. సెక్సాలజిస్ట్ దగ్గరికి వెళ్లాలని అనుకుంటున్నాము. అక్కడ సెక్స్ థెరపీ & కౌన్సెలింగ్‌లో ఏమి ఉంటుందో చెప్పగలరా ?

జవాబు : మంచి ప్రశ్న అడిగారు. మీ మొదటి సెషన్‌లో మీ థెరపిస్టు మీ సమస్యల గురించి తెలుసుకుంటారు దాంపత్య, వ్యక్తిగత, కుటుంబ, భావోద్వేగ, కమ్యూనికేషన్ సమస్యలన్నీ వాళ్లు అడిగే ప్రశ్నల్లో ఉంటాయి. ఆ తర్వాత మీకు సంబంధించిన సెక్స్ సమస్యలు గురించి ప్రశ్నిస్తారు.

సాధారణంగా వాళ్లు అడిగే ప్రశ్నలు ఇలా ఉంటాయి.

* మీ సెక్సువల్ హిస్టరీ ? దంపతులుగా మీ ఇద్దరివి, అలాగే మీ ఒక్కరివి.

* మీ జనరల్ మానసిక ఆరోగ్యం, లైంగిక ధోరణులు, జెండర్ ఐడెంటిటీ గురించి.

* మీ కుటుంబం గురించి.. మీకు వాళ్లతో ఉన్న సంబంధాల గురించి.

*గతంలో మీకు ఏమైనా మానసిక గాయాలు అయ్యాయా ? ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా?

*సెక్స్ సమస్య కాకుండా మీ భాగస్వామితో మీకు ఇతర సమస్యలు ఉన్నాయా ?

*మీకు సెక్సువల్ హ్యాబిట్స్, అలవాట్లు ఏమైనా ఉన్నాయా ?

*సెక్స్ కోరికతో సంబంధం లేకుండా మీరు మీ భాగస్వామిపై మీకున్న అనురాగాన్ని ఎలా వ్యక్తీకరిస్తారు?

*సెక్స్ థెరపిలో సైకోథెరపీ, మానసిక దాంపత్య సంబంధాల కౌన్సిలింగ్, శాస్త్రీయమైన సెక్స్ ఎడ్యుకేషన్, దంపతులు ఇంట్లో చేసుకోవాల్సిన, పాటించాల్సిన పద్ధతులు, నియమాలు, రిలేషన్ షిప్ థెరపీతో అనుబంధాన్ని పెంచుకునే చికిత్స ఉంటాయి.

*మీరు మీ భార్యతో మంచి సెక్సాలజిస్ట్ దగ్గరకి వెళ్లి నిర్భయంగా మీ లైంగిక సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు.


డాక్టర్ భారతి

సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్

ప్రీ & పోస్ట్ మేరేజ్ &

సెక్సువల్‌ కౌన్సెలింగ్

86885 19225

Next Story