మగవారు సరిగ్గా నిద్రపోవడం లేదా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే ?

by velandi.Saikiran |   (  Updated:2025-06-19 21:31:17  IST  )

ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మనం ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టకపోతే అనేక రకాల సమస్యలు వస్తున్నాయి.

మగవారు సరిగ్గా నిద్రపోవడం లేదా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే ?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మనం ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టకపోతే అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. పర్యావరణ కాలుష్యం, కలుషిత ఆహారం కారణంగా అనేక సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా.. మనిషికి నిద్ర కచ్చితంగా ఉండాలి. నిద్ర లేకుండా పని చేస్తే.. దెబ్బతినడం ఖాయమని చెబుతున్నారు నిపుణులు.

ముఖ్యంగా పురుషులు తగినంత సమయం.. నిద్రపోవాలని చెబుతున్నారు. లేకపోతే సంతానలేని సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. నిద్రలేమి కారణంగా హార్మోన్ల ఉత్పత్తి ఇన్ బ్యాలెన్స్ అవుతుందట. దీంతో ఫెర్టిలిటీ సామర్ధ్యం పై ఎఫెక్ట్ పడే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. పురుషులలో స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోవడం జరుగుతుందని వైద్యులు సూచనలు చేస్తున్నారు.

టెస్టోస్టిరాన్ హార్మోన్ల స్థాయిని తగ్గిస్తుందని కూడా చెబుతున్నారు. అందుకే పురుషులు కచ్చితంగా ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్ర పోవాలని సూచనలు చేస్తున్నారు. రోజు ఒకే సమయంలో పడుకుని.. ఒకే సమయంలో లేస్తే ఇంకా మంచిదని స్పష్టం చేస్తున్నారు వైద్యులు.

(Note : పైన పేర్కొన్న సమాచారం వైద్యుల సూచనల మేరకు చెప్పినదే. ఏదైనా సమస్య ఉంటే కచ్చితంగా వైద్యులను కలిస్తే మంచిది.)

Next Story